Advertisementt

‘వకీల్ సాబ్’పై అంచనాలు పెంచేస్తున్నాడు

Fri 11th Sep 2020 08:40 PM
vakeel saab,pawan kalyan,director venu sriram,rumors,special song  ‘వకీల్ సాబ్’పై అంచనాలు పెంచేస్తున్నాడు
Director Venu Sriram talks about Vakeel Saab ‘వకీల్ సాబ్’పై అంచనాలు పెంచేస్తున్నాడు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరోనా రాకపోతే ఎప్పుడో షూటింగ్ పూర్తయ్యి సినిమా విడుదలయ్యేది. అయితే పవన్ కళ్యాణ్‌ని హైలెట్ చేస్తూ వకీల్ సాబ్ తెరకెక్కించాలని... ఈ సినిమా మహిళా ప్రాధాన్యత మూవీ, కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్‌ని పెంచేందుకు ఫైట్స్, పాటలు అంటూ చిత్ర బృందం హడావిడి చేస్తుంది అని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ ప్రచారంపై స్పందించాడు. పవన్ కళ్యణ్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ లుక్ ని పవన్ కళ్యాణ్ మీదే చేసాం. కానీ ఈ సినిమాలో మహిళా ప్రాధాన్యతే ఎక్కువ.

అందుకే మగువ సాంగ్ ని కనీసం పవన్ ఫోటో లేకుండా మహిళలకు అంకితమిచ్చాం. అయినా అలాంటి ఓ సాంగ్ పింక్ లో కానీ, అజిత్ చేసిన తమిళ రీమేక్ లో కానీ లేదు. కానీ మేము చేసాం. ఇక టీజర్ కూడా పవన్ ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకునే కట్ చేసాం. ఆయనని అలా చూడడానికే పవన్ ఫ్యాన్స్ ఇష్టపడతారు అంటూ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టాడు. ఇక ఈ సినిమాలో పవన్ మీద డాన్స్ లు కూడా ఊహించుకోవద్దు.. ఆయన అలా నడిచొస్తేనే ఫ్యాన్స్ కి పూనకాలొచ్చేస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఒకటి కాదు చాలా గెటప్స్ లో కనిపిస్తారంటూ వకీల్ సాబ్ పై వేణు శ్రీరామ్ అందరికి క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఓ 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని.. పవన్ పై చిత్రీకరించాల్సి సన్నివేశాలు కొన్ని ఉన్నాయని.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టి చిత్రీకరణ పూర్తి చేస్తామని చెప్పాడు.

Director Venu Sriram talks about Vakeel Saab:

Director Condemned the rumors on Vakeel Saab 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ