Advertisementt

పవన్ లేకుండానే స్టార్ట్ చేస్తారంట..!

Fri 11th Sep 2020 10:07 PM
vakeel saab,pawan kalyan,shooting,politics,dheeksha,power star  పవన్ లేకుండానే స్టార్ట్ చేస్తారంట..!
Vakeel Saab Movie Latest Update పవన్ లేకుండానే స్టార్ట్ చేస్తారంట..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం షూటింగ్స్ అన్ని పక్కనబెట్టి చాతుర్మాస దీక్ష చెయ్యడమే కాదు.. రాజకీయాల్లో భాగంగా అంతర్వేది రథం దగ్ధం అవడంతో.. అది అశుభం అని పవన్ కళ్యాణ్ నేడు.. జనసేన-బీజేపీ సంయుక్తంగా పిలుపునిచ్చిన ధర్మ పరిరక్షణ దీక్షలో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో దీక్ష చేపట్టాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటాడంటే నమ్మకం లేదు. అందుకే ఇప్పుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ షూటింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ సీన్స్ లేని షూటింగ్ ని ముందు పూర్తి చేయబోతున్నాడట.

కేవలం 20 రోజుల షూటింగ్ చిత్రీకరణ మిగిలి ఉన్న వకీల్ సాబ్ సినిమాకి సంబందించిన షూట్ లో పవన్ కళ్యాణ్ సన్నివేశాలు కూడా తెరకెక్కించాలని దర్శకుడు చెబుతున్నాడు. అయితే పవన్ వచ్చే లోపు పవన్ కి సంబంధం లేని సీన్స్ తెరకెక్కించిన తర్వాత... పవన్ వచ్చాక ఆయన సీన్స్ పూర్తిగా చిత్రీకరించి ఎడిటింగ్, రీరికార్డింగ్‍ కూడా చేసేసి వకీల్‍సాబ్‍ ని పూర్తిగా రెడీ చెయ్యాలని టీమ్‍ డిసైడ్‍ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చే నెల అంటే అక్టోబర్ లో కూడా వకీల్ సెట్స్ మీదకి రాకపోవచ్చని.. ఏకంగా నవంబర్ నుండి పవన్ సినిమా సెట్స్ మీదకెళ్ళి ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Vakeel Saab Movie Latest Update:

Vakeel Saab Movie shoot starts without Pawan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ