Advertisementt

సోలో బ్రతుకే సో బెటరు.. పూర్తయిపోయింది..

Fri 11th Sep 2020 11:20 AM
solo brathuke so better,sai dharam tej,nabha natesh,subbu,thaman  సోలో బ్రతుకే సో బెటరు.. పూర్తయిపోయింది..
Sai Dharam wrapped SBSB shooting.. సోలో బ్రతుకే సో బెటరు.. పూర్తయిపోయింది..
Advertisement
Ads by CJ

చిత్రలహరి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కిన సాయి ధరమ్ తేజ్, ఆ తర్వాత ప్రతీరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రెండు సినిమాలు ఇచ్చిన విజయాలతో వరుసగా సినిమాలని లైన్లో పెడుతున్న సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. 

కరోనా లేకపోయుంటే సోలో బ్రతుకే సో బెటరు ఈ పాటికి థియేటర్లలోకి వచ్చేసేది. కోవిడ్ కారణంగా ఆలస్యం అయిన ఈ చిత్ర షూటింగ్ ఈరోజే కంప్లీట్ చేసుకుంది. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు. సరదా సరదాగా సాగిన సోలో బ్రతుకే సో బెటరు షూటింగ్ పూర్తయ్యిందని, చిత్రీకరణ సమయంలో ఎప్పుడు కూడా డల్ గా ఫీల్ అవ్వలేదని, మాస్కులు పెట్టుకోకుండా షూటింగ్ చేసినప్పుడు గానీ, మాస్కులు పెట్టుకుని షూటింగ్ కి వచ్చినపుడు గానీ, హ్యాపీగా గడిచిపోయిందని చెప్పుకొచ్చాడు.

సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా కనిపిస్తుంది. సుబ్బు అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసాడు. థమన్ స్వరాలు సమకూర్చాడు.

Click here for Tweet

Sai Dharam wrapped SBSB shooting..:

Sai Dharam wrapped Solo brathuke so better shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ