Advertisementt

పవన్ ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే..!

Mon 14th Sep 2020 03:42 PM
pawan kalyan,surender reddy,movie,big challenge,doubt  పవన్ ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే..!
Doubts on Pawan Kalyan and Surender Reddy Movie పవన్ ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా సైలెంట్‌గా సినిమాలు లైన్‌లో పెట్టాడు. రెండున్నరేళ్లుగా వెండితెరకి దూరంగా ఉన్న పవన్ ఒక్కసారిగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. వకీల్ సాబ్, క్రిష్ మూవీ, హరీష్ శంకర్ సినిమాలు తర్వాత పవన్ సినిమాలని పక్కనబెట్టి మళ్ళీ రాజకీయాల వెంట పడతాడనుకుంటే.. మధ్యలోకి సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ రావడంతో పవన్ ఫ్యాన్స్‌‌కి హ్యాపీ. కానీ నిర్మాతలకు ఇబ్బందిగానే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలానే స్లోగా షూటింగ్ చేస్తే మళ్ళీ ఎన్నికల టైంకి మూడు సినిమాలు చక్కబెట్టాలంటే కుదిరేపని కాదు.

మధ్యలో జమిలి ఎన్నికలంటే ఇక పవన్ ఒప్పుకున్న సినిమాలు కూడా పక్కనపెట్టాల్సిందే. గతంలో పవన్ హీరోగా చాలా సినిమాలు అధికారికంగా ప్రకటించినా పట్టాలెక్కనట్టే.... ఇప్పుడు ఈ సినిమాల పరిస్థితి ఉంటుందా? పవన్ ఒప్పుకున్న సినిమాలకి, ఆయా నిర్మాతలకి న్యాయం చేయగలడా? అని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. పవన్ డబ్బు కోసమే సినిమాలు ఒప్పుకున్నా.. ఎన్నికల టైంకి సినిమాలు ఫినిష్ కాకపోతే కష్టమే. 

రాజకీయాలకు సినిమాలకు కలిపి టైం స్పెండ్ చెయ్యాలంటే.. ఇప్పుడంటే కుదురుతుంది కానీ.. ఎన్నికల టైంలో కుదిరేపని కాదు... రాజకీయాల్లో ప్రజల మధ్యన తిరుగుతూ షూటింగ్ అంటే అయ్యే పని కాదు.. అందుకే పవన్ ఈ క్రిష్, హరీష్, సురేందర్ రెడ్డి సినిమాలకు న్యాయం చేస్తాడా? నిర్మాతలు ఇబ్బంది పడకుండా చూడగలడా? అనేది ఇప్పుడు పవన్ ముందున్న అతిపెద్ద సవాల్.

Doubts on Pawan Kalyan and Surender Reddy Movie:

This is Big Challenge to Power Star Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ