అజయ్ భూపతి కలల ప్రాజెక్ట్ మహా సముద్రం సినిమాపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి ఈ సినిమాని మొదలెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ముందు నుండి హీరోయిన్ స్థానంలో సమంత పేరు వినిపిస్తుంది. మహాసముద్రం నాగ చైతన్య దగ్గరకు వెళ్ళినప్పటి నుండి సమంతనే హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. మధ్యలో సమంత చెయ్యనంది అంటే... కాదు అజయ్ భూపతి వాళ్ళే సమంతని వద్దనుకున్నారు. ఇది సమంతకే చాలా అవమానం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అసలు సమంతని సంప్రదించారో లేదో ఆమె ఏమన్నదీ ఎవరికీ క్లారిటీ లేదు.
అయితే తాజాగా మహాసముద్రంలో శర్వానంద్ తో పాటుగా మరో హీరో సిద్దార్ధ్ కూడా నటించబోతున్నాడని ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్త కాస్త ఇప్పుడు అధికారికం అయ్యింది. అయితే ఈ సినిమాలో అజయ్ వాళ్ళు అడిగినా సమంత చేయకపోవడానికి కారణం సిద్దార్ధే అనే టాక్ మొదలయ్యింది. ముందు నుండి అజయ్ భూపతి సెకండ్ హీరోగా సిద్ధునే అనుకుంటున్నాడట. అందుకే సమంత చెయ్యను అని చెప్పింది అంటుంటే.. సిద్దార్ధ్ ని తీసుకోవాలనే ఆలోచన రాగానే సమంతనే అజయ్ భూపతి టీం ఈ సినిమాలో వద్దనుకుందట. ఎందుకంటే గతంలో సమంత - సిద్దార్ద్ లవ్ లో ఉన్నారని.. తర్వాత బ్రేకప్ అయ్యాక సమంత డిప్రెషన్ లో ఉండగానే చైతు ప్రేమే ఆమెని మామూలు మనిషిని చేసింది అని అంటుంటారు.
సమంత కూడా ఒకానొక సందర్భంలో సిద్దు పేరు ఎత్తకుండా నా కెరీర్ లో, నా లైఫ్ లో ఓ వరస్ట్ సిట్యువేషన్ ఉంది.. ఆ టైంలో చాలా బాధపడ్డాను, ఓ వ్యక్తి నన్ను మోసం చేసాడు. కానీ చైతుతో పరిచయం నన్ను కోలుకునేలా చేసింది అని చెప్పింది. మరి ఇదంతా చూస్తుంటే మహాసముద్రంలో సమంత చేయనని చెప్పాకే సిద్దు నటిస్తున్నాడా? లేదంటే అజయ్ భూపతి వాళ్లే సమంతని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దనుకున్నారా? అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్.