జబర్దస్త్‌లో అవినాష్‌కి మాస్ అవినాష్‌గా మంచి క్రేజ్ ఉంది.. కెవ్వు కార్తీక్ - మాస్ అవినాష్ టీంకి మంచి క్రేజ్ ఉంది. అంత క్రేజ్‌తో అవినాష్ బయట షోస్ కూడా చేస్తుంటాడు. అందుకే బిగ్ బాస్ సీజన్ 4 కి అవినాష్‌ని స్పెషల్‌గా తీసుకున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.. అయితే జబర్దస్త్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న అవినాష్ జబర్దస్త్ నుండి బిగ్ బాస్‌కి వెళ్ళడానికి మల్లెమాలకి 10 లక్షల ఫైన్ కట్టాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అగ్రిమెంట్ ప్రకారం జబర్దస్త్‌ని వదిలి వేరే షోకి వెళ్ళడానికి మల్లెమాల కంటెస్టెంట్స్ నుండి 10 లక్షల ఫైన్ వసూలు చేస్తుందట. దానికి అవినాష్ ఓకే చెప్పి పది లక్షల ఫైన్ కట్టినట్టుగా న్యూస్ ఉంది.
అయితే అక్కడ అవినాష్ 10 లక్షల భారీ ఫైన్ కట్టి ఇక్కడ బిగ్ బాస్‌లో ఎంటర్టైన్ చెయ్యడానికి వచ్చాడు. బిగ్ బాస్‌లో జోకర్‌లా అడుగుపెట్టినప్పటి నుండి అవినాష్ కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. బుల్లితెర ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేక్షకుల అటెంక్షన్‌ని అవినాష్ ఆటోమాటిక్‌గా తన వైపు తిప్పుకోవడానికి కారణం బిగ్ బాస్ లో పస ఉన్న కంటెస్టెంట్స్ లేకపోవడమే.
అయితే బిగ్ బాస్ లో అవినాష్‌కి రోజుకి 50 వేల చొప్పున పారితోషకం ఫిక్స్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం. జబర్దస్త్‌లో క్రేజ్ ఉన్న అవినాష్‌ని బిగ్ బాస్‌లోకి రప్పించి రోజుకి 50 వేలు కడుతున్నారట. లాస్య, అమ్మ రాజశేఖర్ లాగా అవినాష్‌కి బిగ్ బాస్ రోజుకి 50 వేలు ఇస్తుందట. ఇక అవినాష్‌ని ఓ రెండు నెలలపాటు షోలో ఉంచే ప్లాన్ తోనే బిగ్ బాస్ టీం అవినాష్‌ని హౌస్‌లోకి పంపిందట.