Advertisementt

కలర్ ఫోటో..ప్రచారం జోరుగా ఉంది.

Sun 20th Sep 2020 08:20 PM
colour photo,suhas,chandini chowdary,sai rajesh neelam  కలర్ ఫోటో..ప్రచారం జోరుగా ఉంది.
Colour Photo crazy Promotion.. కలర్ ఫోటో..ప్రచారం జోరుగా ఉంది.
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా చిన్న సినిమాల హవా ఎక్కువైంది. చిన్న సినిమాలే అయినా పెద్ద ప్రభావం చూపుతున్నాయి. దాంతో పెద్ద నిర్మాణ సంస్థలు కూడా చిన్న సినిమాలు నిర్మించడానికి ఉత్సాహం చూపుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హృదయ కాలేయం సినిమాతో రచయితగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం నిర్మాతగా మారి, తెరకెక్కించిన చిత్రం.. కలర్ ఫోటో.

చిన్న చిన్న పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సుహాస్, కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారుతున్నాడు. కొత్త దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన కలర్ ఫోటో టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకి రానుంది. 

అరెరే ఆకాశం అనే పాటని రేపు లాంచ్ చేయబోతున్నారట. మంచు మనోజ్ చేతుల మీదుగా ఈ పాటని లాంచ్ చేస్తున్నారు. ఈ విషయమై తాజాగా అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం, సిగ్నేచర్ స్టెప్ వీడియోని రిలీజ్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ, హీరో సుహాస్, దర్శకుడు సందీప్ రాజ్ ఇందులో కనిపించారు. అక్టోబర్ 23వ తేదీన ఆహాలో అందుబాటులో ఉండనున్న ఈ సినిమాకి చిత్రబృందం చేస్తున్న ప్రచారం ఆసక్తిగా ఉంది.

Click here for Video

Colour Photo crazy Promotion..:

Colour Photo crazy Promotion..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ