నిన్నటివరకు బిగ్ బాస్ సీజన్ 4 చాలా చప్పగా సాగింది. షోలో తెలియని మొహాలు కామెడీ చేసినా బుల్లితెర ప్రేక్షకులు నవ్వలేని పరిస్థితి. అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ సేఫ్ గేమ్ ఆడడం మొదటి రోజు నుండి జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ 4 పై మీమ్స్, ట్రోల్స్ భీభత్సముగా మొదలయ్యాయి. గత వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే ఈ బిగ్ బాస్ 100 రోజులు స్టార్ మాలో సాగడం కష్టమే అనుకున్నారు. నిజంగానే అందరూ సెల్ఫ్ నామినేషన్‌కి వెళ్లి చికాకు పుట్టించారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ సేఫ్‌గా ఎవరేమనుకుంటారో.. ఒకరితో గొడవ అవసరమా అంటూ ఎవరికీ వాళ్ళే గమ్మునుంటున్నారు. జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాకే షోలో కాస్త ఊపు వచ్చింది. తాజాగా నాగార్జున హోస్టింగ్‌లో ప్రసారమైన శనివారం ఎపిసోడ్ చూస్తే అబ్బ నాగ్ అందరికి ఓ మాస్టర్ లా క్లాస్ పీకాడనిపిస్తుంది. నాగ్ కాస్త కోపంగా ఒక్కో కంటెస్టెంట్‌ని ఉతికి ఆరేసాడు.
ఎలిమినేషన్‌లో ఉన్న వారిని నుంచో బెట్టి గంగవ్వని సేవ్ చేస్తున్నట్టుగా ప్రకటించి.. బిగ్ బాస్ గేమ్‌లో సిల్లీ నామినేషన్స్ చేసారంటూ ఇంటి సభ్యులపై కోపం ప్రదర్శిస్తూ.. మీరంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఇప్పుడు ఎలా సేఫ్ గేమ్ ఆడతారో చూస్తా అంటూ.. హీరో - జీరో టాస్క్‌తో ఒక్కొక్కళ్ళని ఒణికించాడు. ఇక హీరో - జీరో టాస్క్‌లో చాలామంది అమ్మ రాజశేఖర్ హీరో అంటే కళ్యాణి, కుమార్ సాయిలకి జీరోలుగా ఓట్లేశారు. దెబ్బకి మొహం మీద ముసుకు తీసి ఫెయిర్ గేమ్ స్టార్ట్ చేసారు ఒక్కొక్కరు. ఇక లాస్య అన్న మాటకి అమ్మ రాజశేఖర్ చిన్న పిల్లాడిలా కంటతడి పెట్టగా గంగవ్వ ఇంటి సభ్యులు ఓదార్చారు.
ఇక లాస్య - దివి మధ్య మాటల యుద్ధం.. ఈ వీక్‌లో రెండు ఎలిమినేషన్స్‌లో ఒకటి కళ్యాణి ఎలిమినేషన్ జరిగింది. కళ్యాణిని ఈ బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ ఎలిమినేటర్‌గా బయటికి వచ్చింది. ఇక నాగ్ పీకిన క్లాస్ వలన బిగ్ బాస్ షో రక్తి కట్టింది. నాగ్ కోపం షో చూసే వారిలో ఉత్సాహాన్ని నింపింది. మరి ఈ వారం సెకండ్ ఎలిమినేటర్ ఉన్నారని చెప్పి ఆదివారం షో అంతా కంటెస్టెంట్స్‌తో ఆడుకున్న నాగ్.. చివరికి ఎలిమినేషన్ ఎవరినీ చేయలేదు. దీంతో కంటెస్టెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.