Advertisementt

బిగ్‌బాస్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్!

Mon 21st Sep 2020 06:58 PM
review on bigg boss-4,sunday twists,akkineni nagarjuna,dethadi harika,elimination,safe game,ipl  బిగ్‌బాస్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్!
Review On Bigg Boss-4 Sunday.. Twists! బిగ్‌బాస్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్!
Advertisement
Ads by CJ

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-4 సీజన్ మొదట అంతగా పస లేదని అనిపించినా రోజురోజుకూ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనంతరం భారీగానే టీఆర్పీ రేటింగ్ సైతం దక్కించుకుంది. ఇందుకు కారణం టాస్క్‌లు, కంటెస్టెంట్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, గంగవ్వే. వాస్తవానికి ఇదంతా ముందే అనుకున్న స్క్రిప్టే అయినా దాన్ని పండించడంలో అసలు మజా అనేది ఉంటుంది. అది మొదటి వారం అంతగా అనిపించకపోయినా.. సెకండ్ వీక్ నుంచి మాత్రం అదిరిపోయింది. ఇక ఈ ఆదివారం షోలో ఏం జరిగింది..? ఎవరూ ఊహించినట్లుగా బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..? నాగ్ ఎందుకిలా చేశారు..? ఈ వారం ఎవరూ ఎందుకు ఎలిమినేట్ కాలేదు..? అనే విషయాలు ఒక్కసారి చూద్దాం.

సేవ్ అయ్యారిలా..!

ఒక లైలా కోసం అనే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వచ్చీ రాగానే సెల్ఫ్ నామినేట్‌పై మాట్లాడారు. అసలు ఏంటిది..? ఎందుకిలా సెల్ఫ్ నామినేట్ అవ్వడంజజ? ఇదంతా కరెక్ట్ కాదని కరాటే కల్యాణికి నాగ్ ఒకింత క్లాసే పీకారు. అనంతరం కరాటే కల్యాణి కంటెస్టెంట్‌లందరి గురించి చెప్పగా బిగ్ బాంబ్‌ను ఇచ్చారు బాస్. దాని ప్రకారం కల్యాణి సూచించిన కటెంస్టెంట్ ఈ వారం నామినేట్ అవుతారని చెప్పగా.. ఆమె టీవీ9 యాంకర్ దేవి నాగవల్లిపై బిగ్ బాంబ్ వేశారు. దీంతో దేవి నాగవల్లి నామినేట్ అవ్వగా.. కల్యాణి వెళ్లిన అనంతరం నాగ్ ఓ గేమ్ ద్వారా అభిజిత్, కుమార్ సాయిలను సేవ్ చేశారు. నెక్ట్స్ అందరితో గేమ్ ఆడించారు. మొదట అఖిల్, అభిజిత్‌తో గేమ్ ఆడించగా.. దానిలో అఖిల్ గెలిచాడు. నెక్ట్స్ మొనాల్, హారికతో ఆడించగా.. మొనాల్ గెలిచింది. ఈ క్రమంలో నెక్ట్స్ అమ్మ రాజశేఖర్‌ను నాగ్ సేవ్ చేశారు. గేమ్ మొత్తం మీద గంగవ్వ రాక్ చేసేశారు. ఆమె వయసుకు అద్భుతంగా డ్యాన్స్ చేయడమే కాకుండా.. గేమ్‌ను సైతం గెలిచారు. ఈసారి సొహైల్‌, ఆ తర్వాత నోయెల్‌ను కూడా సేవ్ చేశారు. 

ఇదీ ట్విస్ట్ అంటే..!

ఇక మిగిలింది మొనాల్, దేత్తడి హారిక మాత్రమే. వారిద్దరినీ సేవ్ చేసేది నామినేషన్స్‌లో లేని ఏడుగురని అని నాగ్ చెప్పారు. ఎవరిని బయటకు పంపించాలనుకుంటున్నారో వారి పాట్‌లో రంగు నీళ్లు పోయాలి. అఖిల్, మెహబూబ్‌, లాస్య ఈ ముగ్గురూ దేవి పాట్‌లో రంగు నీళ్లు పోయగా.. దేవి, అరియానా, దివి, మొనాల్ పాట్‌లో రంగు నీళ్లు పోశారు. ఫైనల్‌గా వచ్చిన సుజాత.. హారిక పాట్‌లో రంగునీళ్లు పోయడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. హారిక ఎలిమినేట్ అయినట్టుగా నాగ్ ప్రకటించేశారు. దేత్తడి పాప ఎలిమినేట్ అయ్యిందని తెలుసుకున్న కంటెస్టెంట్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే బాధతోనే హారికకు  హౌస్‌మేట్స్ అంతా సెండాఫ్ ఇవ్వడానికి గేట్ దాకా వెళ్లారు. హారిక ఔట్ అని అందరూ అనుకున్నారు.. అయితే ఇక్కడే నాగ్ అందరి ఊహాలకు భిన్నంగా హారికను గేట్ దగ్గరకు వెళ్లగానే మళ్లీ కమ్ బ్యాక్ అంటూ వెనక్కి పిలిచారు. నిజంగా ఇది ఎవరూ ఊహించని ట్విస్టే. అసలు ఎలిమినేట్ అయిన హారికను మళ్లీ వెనక్కు పిలవడంతో ప్రేక్షకులు, ఆమె అభిమానులు, ఫాలోవర్స్ హ్యాపీగా ఫీలయ్యారు. 

ఐపీఎల్‌ను తట్టుకునేందుకేనా..!

వాస్తవానికి నాలుగైదు రోజులుగా ఈ వారం హారిక ఔట్.. ఆమెతో పాటు మరొకరు కూడా ఎలిమినేట్ (ఇద్దరూ ఒకేసారి) అంటూ అటు పలు వెబ్ సైట్స్‌లో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ప్రాపగండ జరిగింది. చివరికి వీటన్నింటికీ నాగ్ ఫుల్ స్టాప్ పెట్టేసి ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. కంటెస్టెంట్స్ అందరూ ఎవరికి వారుగా సిల్లీగా ప్రవర్తించడంతోనే తాను ఇలా చేయాల్సి వచ్చిందని కింగ్ చెప్పారు. సో.. ఆదివారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయంటూ మీమ్స్‌తో ప్రేక్షకులు, విమర్శకులు గట్టిగానే ఇస్తున్నారు. కొందరైతే.. ఫేక్ ఎలిమినేషన్‌పై మండిపడుతూ బూతులే తిట్టేస్తున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి చివరికి ఇలా జరిగిందేంటి..? ‘ఐపీఎల్‌ను తట్టుకునేందుకే టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలా చేస్తున్నారా..?’ అని ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరికి సిల్లీ అండ్ ఫన్నీగా ఆదివారం షో ముగిసింది.

Review On Bigg Boss-4 Sunday.. Twists!:

Review On Bigg Boss-4 Sunday.. Twists!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ