రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఒరేయ్ బుజ్జిగా అక్టోబర్ 2వ తేదీ నుండి ఆహాలో అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ల పనిలో పడింది. మాళవికా నాయర్, హెబ్బ పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం రాజ్ తరుణ్ కి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి. ఐతే ఒక పక్క ఒరేయ్ బుజ్జిగా రిలీజ్ కి రెడీ అవుతుంటే, తాజాగా మరో కొత్త చిత్రాన్ని ఒప్పుకున్నాడని వినిపిస్తుంది.
రాజ్ తరుణ్ తో సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు సినిమా తెరకెక్కించి అపజయం మూటగట్టుకున్న శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. అది కూడా నాగార్జున నిర్మాతగా రూపొందనుందని అంటున్నారు. రాజ్ తరుణ్ మొదటి సినిమా ఉయ్యాలా జంపాలా కి కూడా నాగార్జునే నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
ఐతే ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రాజ్ తరుణ్ కి ఆల్రెడీ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు సక్సెస్ ఇవ్వగలడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సినిమాపై మంచి అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఐతే ఈ సినిమాపి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.