Advertisementt

‘ఎఫ్ 3’ లో నేనే హీరోయిన్‌ అంటోంది

Wed 23rd Sep 2020 04:10 PM
mehreen kour,anil ravipudi,heroine,f3 movie,venkatesh,varun tej  ‘ఎఫ్ 3’ లో నేనే హీరోయిన్‌ అంటోంది
Heroine Mehreen clarity about in her role in F3 ‘ఎఫ్ 3’ లో నేనే హీరోయిన్‌ అంటోంది
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. దిల్ రాజు దానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తీద్దామని అనిల్ రావిపూడి చెప్పడము, తర్వాత అనిల్‌కి, మహేష్ ఆఫర్ రావడంతో అనిల్ రావిపూడి, మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసాడు. అయినా దిల్ రాజ్ ఎఫ్ 3 ని వదల్లేదు. ఇక సరిలేరు తర్వాత అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి చేసినా హీరో లెవరు ఖాళీగా లేకపోవడంతో అనిల్ కూడా గమ్మునున్నాడు. ఇక వచ్చే ఏడాదే ఎఫ్ 3 ఉంటుంది అని వెంకటేష్ ప్రకటించాడు. ఈలోపు వరుణ్ తేజ్ కూడా కాస్త ఫ్రీ అవుతాడు. కరోనా కారణంగా ఈ ఏడాదే మొదలవ్వాల్సిన ఎఫ్ 3 కాస్త వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.

అయితే అనిల్ రావిపూడి వెంకీ - వరుణ్‌లతోనే ఎఫ్ 3 మొదలు పెట్టినా.. మరో హీరోని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యడంతో పాటుగా హీరోయిన్స్ ప్లేస్‌లోకి కొత్తవారికి తీసుకుంటున్నారనే ప్రచారం జరగగా.. తాజాగా ఎఫ్ 2 భామ మెహ్రీన్ కౌర్ మాత్రం ఎఫ్ 3 లో నేనే హీరోయిన్ అంటుంది. నాతో పాటు ప్రైమరీ కాస్ట్ మొత్తం ఉంటుంది అని చెప్పిన మెహ్రీన్ కౌర్ ఒకప్పుడు డిప్రెషన్‌తో బాధపడింది.

డిప్రెషన్ నుండి బయటికి రావాలంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడం, మనల్ని మనం నమ్ముతూనే దేవుణ్ణి కూడా నమ్మాలంటుంది మెహ్రీన్. మరి సినిమాలు మానేస్తుంది అని ప్రచారం జరిగినా మెహ్రీన్ కౌర్ మాత్రం ఎఫ్ 3 తో తాను సినిమాలు వదలడం లేదని చెప్పకనే చెప్పింది. 

Heroine Mehreen clarity about in her role in F3:

I am the Heroine in F3 movie says Mehreen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ