సర్కారు వారి పాట సినిమా ప్రకటన వచ్చినపుడు మహేష్ పక్కన నటించే హీరోయిన్ గురించి రకరకాల కథనాలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ని తీసుకొస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేసాయి. సాయి మంజ్రేకర్ కూడా తన కుటుంబానికి నమ్రత చాలా క్లోజ్ అని చెప్పడంతో మహేష్ పక్కన సాయి నటిస్తుందని ఫిక్స్ అయిపోయారు. కానీ సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ఎంపికనట్లు తెలిసింది.
మహేష్ పక్కన సర్కారు వారి పాటతో తెలుగులో ఎంట్రీ ఇవ్వలేకపోయినా, తాజా సమాచారం ప్రకారం మహేష్ నిర్మాణంలో రూపొందుతున్న మేజర్ సినిమాలో కీలక పాత్రకోసం సాయి మంజ్రేకర్ సెలెక్ట్ అయినట్టుగా సమాచారం. అడవి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మహేష్ కూడా ఒక నిర్మాత.
సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా సాయి మంజ్రేకర్ ఒకానొక పాత్రలో నటించనుందని తెలుస్తుంది. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న అడవి శేష్ చేస్తున్న మేజర్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.