బిగ్ బాస్ నాలుగవ సీజన్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. మొదటి వారం చప్పగా సాగిపోయినా ఆ తర్వాత మెల్లగా పుంజుకుని ప్రస్తుతం చాలా ఆసక్తిగా మారింది. ఒక పక్క ఐపీఎల్ నడుస్తున్నా కూడా బిగ్ బాస్ కి రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. ఐతే షోని మరింత రసవత్తరంగా మార్చేందుకు హౌస్ లోకి మరో కంటెస్టెంట్ వెళ్లబోతున్నారని టాక్. ఇప్పటికే హౌస్ లోకి ఇద్దరు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే.
మొదట వచ్చిన కుమార్ సాయి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. మొదటి వారంలో సేఫ్ అయిపోయినా ఈ వారం కష్టమే అంటున్నారు. ఇక రెండవ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ముక్కు అవినాష్ బాగానే ఆకట్టుకుంటున్నాడు. తనదైన ఆటతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఐతే వీరిద్దరూ ఇంకా హౌస్ లో ఉండగానే మరో వైల్డ్ కార్డ్ అంటూ పుకార్లు వస్తున్నాయి.
మూడవ వైల్డ్ కార్డ్ ద్వారా స్వాతి దీక్షిత్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. బ్రేకప్, జంప్ జిలానీ, చిత్రాంగద సినిమాల్లో కనిపించిన స్వాతి దీక్షిత్ హౌస్ లోకి రానుందని వినిపిస్తుంది. ఆల్రెడీ ఇద్దరు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాక మళ్లీ మూడవ ఎంట్రీ ఎందుకనేది బిగ్ బాస్ వారికే తెలియాలి.