Advertisementt

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు ఇకలేరు

Sat 26th Sep 2020 07:43 AM
sp balasubramaniam,sp balasubramaniam no more,sp balasubramaniam singer,legend,no more,passes away,sp charan  గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు ఇకలేరు
Legend SP Balasubramaniam Is No More గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు ఇకలేరు
Advertisement
Ads by CJ

గాన గంధర్వుడు SP బాలసుబ్రమణ్యం గత నెల (ఆగష్టు) 5 న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నై ఎంజిఎం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పటినుండి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ.. తర్వాత SP బాలు ఆరోగ్యం క్షీణించడంతో చెన్నై ఎంజిఎం వైద్యులు ఆయనకి ఎక్మొ సహాయంతో వైద్యం అందించారు. ఎక్మొ సపోర్ట్ తో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే చాలారోజులు బాలు ఆరోగ్యం క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నప్పటికీ.. గత కొన్ని రోజులుగా బాలు కోలుకుంటున్నట్లుగా ఆయన కుమారుడు ఎస్‌పి చరణ్ వీడియోస్ రూపంలో తెలియజెయ్యడము.. ఎంజిఎం వైద్యులు ఎప్పటికప్పుడు బాలసుబ్రమణ్యం హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ తెలియజేస్తున్నారు. ఇక బాలు అభిమానులు, ఆయన పాటలను అభిమానించే వాళ్ళు బాలు కోలుకోవాలని పూజలు చేస్తూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. అయితే ఈ నెల 19 నుండి బాలు ఆరోగ్యంపై ఎంజిఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యకపోయినా... బాలు కుమారుడు చరణ్ బాలు కోలుకుంటున్నారని.. ట్యాబ్ లో క్రికెట్ చూస్తున్నట్లుగా చెప్పారు.

దానితో బాలు సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వస్తారని అందరూ నమ్మిన టైంలో ఎంజిఎం వైద్యులు ఎస్పీ బాలు ఆరోగ్యం మరింత క్షీణించినట్లుగా గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యడంతో అందరూ ఆందోళనలో మునిగిపోయారు. అంతలోనే ఎంజిఎం ఆసుపత్రికి కమల్ హాసన్ రావడం బాలుని ఆయన కుమారుడు చరణ్ ని పరామర్శించి బాలు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా ఆయన మీడియాకి తెలియజేసారు. 

బాలు బుధవారం రాత్రి నుండి అధిక జ్వరంతో బాధపడుతున్నారని.. ఆయన ఆరోగ్యం మరింతగా దిగజారిందని.. గురువారం అంతా ఎంజీఎం వైద్యులు తెలిపారు. SP బాలు శుక్రవారం మథ్యాహ్నం 1 గంట 04 నిమిషాలకు కన్ను మూసినట్లుగా బాలు తనయుడు చరణ్ ప్రకటించడంతో అశేష ప్రేక్షకులు బాధలో మునిగిపోయారు. బాలసుబ్రమణ్యం ఇక లేరని తెలిసి అందరూ బాధాతప్త హృదయాలతో బాలుకి నివాళులు అర్పిస్తున్నారు.

Legend SP Balasubramaniam Is No More:

Great Singer SP Balasubramaniam Passes Away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ