Advertisementt

నా ఉత్సాహానికి, బలానికి కారణమదే: సమంత!

Sat 26th Sep 2020 10:30 PM
samantha akkineni,strength,secret,fitness,reveale  నా ఉత్సాహానికి, బలానికి కారణమదే: సమంత!
Samantha Akkineni secrets revealed నా ఉత్సాహానికి, బలానికి కారణమదే: సమంత!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున కోడలు టాప్ హీరోయిన్ సమంత ఫిట్ నెస్ ఎలా ఉంటుందో ఇప్పటికి ఆమె మెయింటింగ్ చేస్తున్న ఫిగర్ చూస్తే తెలుస్తుంది. పెళ్లి తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిగర్‌ని మెయింటింగ్ చేస్తున్న సమంత ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతుంది. వర్కౌట్స్ వర్కౌట్స్ అంటూ 100 కేజీల బరువు తేలిగ్గా ఎత్తేస్తుంది. ఎప్పటికప్పుడు సమంత జిమ్ వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే జిమ్ చేసేది బాడీ షేప్ కోసం కాదని.. నాకు వర్కౌట్స్ చెయ్యడం చాలా ఇష్టం.. కేవలం శరీరాకృతుల కోసమే జిమ్ చెయ్యడం లేదు.. జిమ్ చేస్తే నాకు ఉత్సాహం, సంతోషం వస్తాయంటుంది సమంత. జిమ్ చెయ్యడం వలన నాలోని హ్యాపీ హార్మోన్స్ విడుదలయ్యి నేను సంతోషంగా ఉండేలా చేస్తుంది. అందుకే నేను ఎక్కువగా జిమ్ చేస్తుంటాను అంటుంది.

నేను జిమ్‌లో వర్కౌట్స్ చెయ్యని రోజు ఏదో కోల్పోయిన దానిలా కాస్త అసంతృప్తిలా అనిపిస్తుంది. వర్కౌట్స్ అనేది కేవలం సన్నబడడానికి కాదు... అందంగా, ఆకర్షణగా, ఉత్సాహంగా ఉండేందుకు అది ఉపయోగపడుతుంది అని చెబుతుంది సమంత. జిమ్ చెయ్యడం వలన బలం పెరుగుతుంది. మీకు ఏది నచ్చితే అది చెయ్యండి. ఇదే చెయ్యాలని రూలేం లేదు. నాకు బోర్ కొట్టిన అలాగే కాస్త ఆందోళనగా ఉన్నా జిమ్‌లోకి వెళ్లి ఉత్సాహంగా వర్కౌట్స్ చేస్తాను.. అప్పుడు ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవచ్చంటుంది సమంత. 

నేను రోజు రోజుకి ఉత్సాహంగా, బలంగా మారడానికి నా వరౌట్స్ కారణం అంటుంది సమంత. మరి ఆరోగ్యంగా ఉందని జిమ్ చెయ్యడమే కాదు.. మంచి కూరగాయలు, మంచి ఫుడ్ తీసుకోవడం ముఖ్యమంటుంది.

Samantha Akkineni secrets revealed:

Samantha Akkineni talks about her strength

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ