Advertisementt

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

Sat 26th Sep 2020 07:37 AM
bigg boss,telugu,sasson4,nagarjuna,lasya,ariyana glory,devi nagavalli,monal,harika  బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Who will be go out from bigg boss house..? బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ ప్రారంభమై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకుంటుంది. ప్రస్తుతం నాలుగవ వారంలోకి ఎంటరవుతున్న షో నుండి మూడవ ఎలిమినేషన్ జరగబోతుంది. ఈ వారం నామినేషన్లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. లాస్య, మోనాల్.అరియానా గ్లోరీ, హారిక, దేవి నాగవల్లి, మెహబూబ్, కుమార్ సాయి..  మొత్తం ఏడుగురు కంటెస్టెంట్ల నుండి హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారనేది ఆసక్తిగా మారింది. ఐతే ఆ ఏడుగురు సభ్యుల్లో లాస్యకి బుల్లితెర మీద మంచి క్రేజ్ ఉంది. అదీగాక హౌస్ లోనూ ఆమె పర్ ఫార్మెన్స్ బాగుంది.

కాబట్టి లాస్య సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అరియానా గ్లోరీ పై సింపతీ బాగా పెరుగుతుంది. అభిజిత్, హారిక, సోహైల్.. ఆమెని చిన్నచూపు చూడడం వల్ల ప్రేక్షకుల్లో ఆమెపై సింపతీ పెరిగింది. మిగిలిన ఐదుగురిలో హౌస్ లోంచి వెళ్ళడానికి పోటీ పడుతున్న వారిలో కుమార్ సాయి, దేవి నాగవల్లి, మోనాల్ కనిపిస్తున్నారు. టాస్కులో మోనాల్ ప్రవర్తన అతిగా అనిపించింది. ఇంకా కుమార్ సాయి అసలేం చేస్తున్నాడో అర్థం కావట్లేదు.

నామినేషన్ టైమ్ లో తప్ప అతను కనిపించలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. గడిచిన రెండు వారాల్లో ప్రేక్షకుల్లో ఎలాంటి ముద్ర వేయలేకపోయాడు. ఇక మిగిలింది దేవి నాగవల్లి. హౌస్ లో చాలా సైలెంట్ గా ఉంటుంది. కానీ ఏదైనా పాయింట్ మీద తన వాదనని చాలా బలంగా వినిపిస్తుంది. కాకపోతే సోషల్ మీడియాలో దేవికి ఉన్న వ్యతిరేకత కారణంగా ఎలిమినేషన్ కి పోటీ పడుతుంది. మరి ఈ ముగ్గురిలో హౌస్ నుండి బయటకి వెళ్లేది ఎవరో చూడాలి.

Who will be go out from bigg boss house..?:

Who will be go out from bigg boss house..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ