Advertisementt

బిగ్‌బాస్4 లోకి అడుగెట్టిన గ్లామర్ బ్యూటీ!

Mon 28th Sep 2020 09:21 PM
swathi dixit,telugu,heroine,bigg boss,house,entry  బిగ్‌బాస్4 లోకి అడుగెట్టిన గ్లామర్ బ్యూటీ!
Telugu Heroine swathi dixit entered Bigg Boss house with wild card entry బిగ్‌బాస్4 లోకి అడుగెట్టిన గ్లామర్ బ్యూటీ!
Advertisement
Ads by CJ

వారం వారం ఇంట్రెస్టింగ్స్ టాస్క్ లతో ప్రేక్షకాభిమానం‌ పొందుతోన్న బిగ్‌బాస్4 షోలో మరో కీలకమార్పు చోటు చేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్‌బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసింది. ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్‌ను బిగ్‌బాస్-4వ సీజన్‌లోకి వెల్కమ్ చెప్పింది. చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్‌బాస్ స్టైల్. వీటి కోసమే సెపరేట్ టాస్క్‌లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోయిన్‌తో షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్‌కు మరింత గ్లామర్ జోడించనున్నారు స్వాతి దీక్షిత్.

రెండేళ్ల క్రితమే స్వాతికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, ఈ సీజన్‌కు తన ఎంట్రీ అవసరం ఉందని స్వాతి డిసైడ్ అయింది.‌ నటిగా ఇప్పటికే బెంగాలీ, తమిళ, తెలుగు సినిమాలతో అలరించిన స్వాతి, హౌస్‌మేట్‌గా బిగ్‌బాస్‌లో అదరగొట్టేందుకు సిద్ధమంటోంది. నిజానికి ఆర్.ఎక్స్ 100 సినిమాలో తొలుత స్వాతినే హీరోయిన్. వారం పాటు షూటింగ్ చేసిన తర్వాత, ఆ బోల్డ్ రోల్, తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గది కాదనీ సినిమా నుంచి తప్పుకుంది. పర్సనల్‌గా స్వాతి నటిగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే‌ తండ్రిని కోల్పోయింది. ఆ బాధను తట్టుకుని, మరోపక్క కుటుంబ బాధ్యతలను కూడా తనపై వేసుకుని, తనకంటూ ఓ ఐడెంటిటిని క్రియేట్ చేసుకునేందుకు స్వాతి సిద్ధమైంది.

ఇక తెలుగు ప్రేక్షకుల ఆదరణ, ఓ తెలుగమ్మాయిగా తనకు ఉంటుందని ఆశిస్తూ.. తనవంతుగా ది బెస్ట్ కంటెస్టెంట్‌గా ఈ రియాలిటీ షోలో గుర్తింపు తెచ్చుకుంటానంటోంది గ్లామరస్ హీరోయిన్ స్వాతి దీక్షిత్.

Telugu Heroine swathi dixit entered Bigg Boss house with wild card entry:

Glamour beauty swathi dixit talks about bigg boss entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ