Advertisementt

ఉపాసన కోసం చెఫ్‌గా టాప్‌ హీరోయిన్‌!

Mon 28th Sep 2020 09:34 PM
samantha akkineni,turns,chef,upasana  ఉపాసన కోసం చెఫ్‌గా టాప్‌ హీరోయిన్‌!
Top Heroine Turns Chef for Upasana ఉపాసన కోసం చెఫ్‌గా టాప్‌ హీరోయిన్‌!
Advertisement
Ads by CJ

అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ని ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల ‘యుఆర్‌లైఫ్’ అనే వెబ్ సైట్‌ను నిర్వహిస్తున్నారు. యుఆర్‌లైప్ వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా - ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే.

ఈ వెబ్ సైట్‌కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా  సమంత, ఉపాసనతో కలిసి ‘తక్కలి సదం’ వంటకాన్ని చేసి చూపించారు. ఆ వంటకం రెసిపీ వీడియోలో చూపించారు. వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ కుకింగ్‌లో పాల్గొన్నారు.

సమంత కూడా ఈ మధ్య ‘అర్బన్ ఫామింగ్’ పేరుతో ఆరోగ్యం మీద, తినే ఆహారం మీద చాలా శ్రద్ద తీసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి అందరికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చూడ ముచ్చటగా ఉంది.

Top Heroine Turns Chef for Upasana:

Samantha Turns Chef for Upasana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ