బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, బ్లాక్ రోస్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అవనుంది. సంపత్ నంది రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఎరుపు రంగు చీరలో నలుపు రంగు జాకెట్టు ధరించి, వయ్యారంగా ఫోజిస్తూ చూడగానే గులాబీలాగా కనిపించింది. ఐతే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామ, అతి త్వరలోనే మరో తెలుగు సినిమాలో కనిపించనుందని వినిపిస్తుంది.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ప్రత్యేక గీతం కోసం ఊర్వశి రౌతేలా రానుందేమో అన్న అనుమానం వస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినమాలో ప్రత్యేక గీతం కోసం ఊర్వశి రౌతేలా ని అడిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రత్యేక గీతంలో ఆడిపాడితే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
ఈ నేపథ్యంలో ఊర్వశి సంప్రదించారని, ఆమె పారితోషికం భారీగా డిమాండ్ చేసిందని వినబడింది. తాజాగా ఊర్వశి రౌతేలా, బ్లాక్ రోజ్ సినిమాలో తనలోని లేడీ అల్లు అర్జున్ ని చూస్తారంటూ కామెంట్ పెట్టింది. డాన్సుల్లో అల్లు అర్జున్ లాగా కనిపిస్తానని చెప్పింది. అదీగాక డాన్సుల్లో అల్లు అర్జున్ ప్రేరణ అని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో ఊర్వశి ఉంటుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ పుష్ప సినిమాలో ఊర్వశి ఓకే అయితే గనక తెర మీద ఇద్దరు అల్లు అర్జున్ లు కనబడతారు.