Advertisementt

శ్యామ్ సింగరాయ్.. రాజుల కాలంలోకి తీసుకెళ్తాడా..?

Mon 28th Sep 2020 08:03 AM
nani,shyam singa roy,sai pallavi,shiva nirvana,tuck jagadish  శ్యామ్ సింగరాయ్.. రాజుల కాలంలోకి తీసుకెళ్తాడా..?
Will Shyam Singha Roy takes into.. శ్యామ్ సింగరాయ్.. రాజుల కాలంలోకి తీసుకెళ్తాడా..?
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని వి చిత్రంతో ఓటీటీ ద్వారా పలకరించాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. సుధీర్ బాబు మరో హీరోగా కనిపించిన వి సినిమా అందర్నీ మెప్పించలేకపోయింది. ఐతే ప్రస్తుతం నాని చేతిలో వరుస సినిమాలున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న టక్ జగదీష్ తో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యయాన్ దర్శకత్వంలో రూపొందనున్న శ్యామ్ సింగరాయ్ కూడా ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో నానికి జోడీగా ఫిదా భామ సాయి పల్లవి కనిపించనుంది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఇది. సాయి పల్లవి, పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. కోల్ కతా ప్రాంత నేపథ్యంలో సాగే ఈ సినిమా నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుందని అంటున్నారు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులని అబ్బురపరుస్తాయట.

పురాతన కోటలో నడిచే కథ ఆసక్తి కలిగిస్తుందట. సెకండాఫ్ మొత్తం ఈ కోటలోనే ఉంటుందట. అంటే సెకండ్ హాఫ్ లో రాజుల కాలంలోకి తీసుకువెళ్తున్నాడేమో అని అనుకుంటున్నారు. శ్యామ్ సింగ రాయ్ అనే పేరు ఎందుకు పెట్టారో ఈ ఛాప్టర్ ద్వారా అర్థం అవుతుందట. ప్రస్తుతం ఈ చిత్రం కోసం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం.

Will Shyam Singha Roy takes into..:

Will Shyam Singha Roy takes into..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ