Advertisementt

డేటింట్‌ చేసినట్లు అంగీకరించిన హీరోయిన్‌!

Wed 30th Sep 2020 07:49 PM
sara ali khan,thailand trip,sushanth singh rajput,dating,accept  డేటింట్‌ చేసినట్లు అంగీకరించిన హీరోయిన్‌!
Sara Ali Khan Confesses Going On Thailand Trip With Sushanth డేటింట్‌ చేసినట్లు అంగీకరించిన హీరోయిన్‌!
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ అన్నాక హీరోలతోనో, లేదంటే బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ అనేది సహజంగా వింటూనే ఉంటాం. ఒకే సినిమాలో కలిసి పనిచేసే హీరో హీరోయిన్స్ చాలామంది డేటింగ్స్ అంటూ రచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ చేసి లవ్ చేసిన కారణంగా రియా చక్రవర్తి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి రియా చక్రవర్తి ఎంత కారణమో దేవుడికే తెలియాలి కానీ.. ప్రస్తుతం సుశాంత్‌కి డ్రగ్స్ ఇచ్చిన కారణంగా ఆమె రిమాండ్‌కి వెళ్ళింది. వెళ్ళింది ఊరుకుందా? బాలీవుడ్‌లో బడా హీరోయిన్స్ పేర్లు బయటపెట్టింది. దీపికా నుండి సారా అలీఖాన్, శ్రద్ద కపూర్, రకుల్ ప్రీత్ పేర్లు ఎన్‌సీబీ ఎదుట బయట పెట్టేసింది.

అంతేకాకుండా సారా అలీఖాన్‌తో సుశాంత్ సింగ్ డేటింగ్ చేసాడని చెప్పింది. ఆ విషయాన్నీ ఎన్‌సీబీ విచారణలో సారా అలీఖాన్ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్‌సీబీ విచారణలో సారా, సుశాంత్ సింగ్ తో తాను డేటింగ్ చేసినట్లుగా.. అలాగే తనకి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది కానీ.. తాను డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని చెప్పినట్టుగా సమాచారం. తాను డ్రగ్స్ తీసుకోలేదు కానీ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పినట్లుగా తెలుస్తుంది. కేతరనాధ్ షూటింగ్ అప్పుడే సారా అలీఖాన్ - సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డేటింగ్ లో ఉన్నారని.. ఆ క్రమంలోనే సారా అలీఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇచ్చే పార్టీలకు హాజరయినట్లుగా ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న న్యూస్. 

మరి సారా ఎన్‌సీబీ ఎదుట సుశాంత్ తో తాను కొంత కాలం డేటింగ్ చేశానని.. ఇది వాస్తవమని చెప్పటమే కాదు... సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి థాయిలాండ్ వెకేషన్‌కి కూడా వెళ్ళినట్లుగా చెప్పిందని అంటున్నారు.

Sara Ali Khan Confesses Going On Thailand Trip With Sushanth:

Sara Ali Khan accepted dating with Sushant Singh Rajput

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ