పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్‌సాబ్‌లో లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. లాయర్ కూడా ఫైట్స్ చేస్తాడని.. వకీల్‌సాబ్ మోషన్ పోస్టర్‌లో అర్ధమైంది. అయితే క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపిస్తాడని ప్రచారం ఉంది. ఇక హరీష్ శంకర్ సినిమాలో పవన్ ఎలా కనిపించబోతున్నాడు.. గతంలో గబ్బర్ సింగ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్‌ని హరీష్ చాలా పవర్ ఫుల్‌గా స్టయిలిష్‌గా చూపించాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో పవన్‌ని, హరీష్ ఎలా చూపిస్తాడో అనే విషయంలో పవన్ ఫ్యాన్స్ తెగ ఆలోచించేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా హరీష్ శంకర్, పవన్‌తో తియ్యబోయే సినిమాలో పవన్ కళ్యాణ్‌ని కాలేజీ లెక్చరర్ పాత్రను చూపించబోతున్నాడని తాజా సమాచారం. అయితే హరీష్ ఈ పాత్రని చాలా గమ్మత్తుగా చూపించబోతున్నాడని.. ఈ పాత్ర ద్వారా పవన్ కామెడీ కూడా చేస్తాడని అంటున్నారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్‌ని యాక్షన్‌కి యాక్షన్.. ఎంటర్ టైన్మెంట్‌కి ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉండేలా రాసుకున్నాడట.
ఇక వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ హిట్ అవడంతో ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్న హరీష్ - పవన్ కాంబోపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.