Advertisementt

బిగ్ బాస్: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేట్ అవబోతుందా..?

Sat 03rd Oct 2020 09:05 AM
bigg boss,kumar sai,swathi deekshith,sohail  బిగ్ బాస్: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేట్ అవబోతుందా..?
Bigg Boss: Will She evict from house..? బిగ్ బాస్: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేట్ అవబోతుందా..?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో నాలుగవ ఎలిమినేషన్ కి సమయం వచ్చేసింది. నామినేషన్లో ఉన్న ఏడుగురిలో ఎవరో ఒకరు హౌస్ నుండి బయటకి వెళ్ళబోతున్నారు. మరి హౌస్ నుండి వెళ్ళిపోయే ఆ కంటెస్టెంట్ ఎవరా అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే సోహైల్, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కుమార్ సాయి గత రెండు వారాలుగా నామినేషన్లో ఉంటూ వస్తున్నాడు.

ఐతే ప్రతీ సారి సేవ్ అవుతూ వస్తున్నాడు. కాకపోతే బయట పెద్దగా ఫాలోయింగ్ లేదని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఇతర కంటెస్టెంట్ల మీద ఉన్న నెగెటివిటీ కారణంగా కుమార్ సాయి సేవ్ అవుతూ వస్తున్నాడని అంటున్నారు. ఈ సారి కూడా సోహైల్ పై ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడింది. అదీగాక బిగ్ బాస్ టీమ్ కూడా సోహైల్ పై కంటెంట్ బాగానే ఇచ్చింది. దానివల్ల వ్యతిరేకత ఇంకా పెరిగినట్టుగా తెలుస్తుంది. 

ఇక స్వాతి దీక్షిత్ విషయానికి వస్తే, వచ్చినప్పటి నుండి పెద్దగా చేసిందేమీ లేదు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతికి అంతగా అభిమానులు ఏర్పడలేదు. సో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోహైల్ మీద నెగెటివిటీ కుమార్ సాయికి ప్లస్ అయ్యి సోహైల్ ఎలిమినేట్ అవుతాడా లేదా ఎలాంటి ఫాలోయింగ్ లేని స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అవుతుందా చూడాలి.

Bigg Boss: Will She evict from house..?:

Bigg Boss: Will She evict from house..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ