Advertisementt

చిన్నపిల్లల మనస్తత్వం అంటూ లెక్చరిస్తోంది

Sat 10th Oct 2020 11:06 AM
nivetha pethuraj,chat chat,sets,child act,actins  చిన్నపిల్లల మనస్తత్వం అంటూ లెక్చరిస్తోంది
Nivetha Pethuraj about Her Mentality చిన్నపిల్లల మనస్తత్వం అంటూ లెక్చరిస్తోంది
Advertisement
Ads by CJ

చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నివేత పేతురాజ్ అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ పక్కన సెకండ్ హీరోయిన్ గా మెరిసింది. అయితే నివేత టాలెంట్, నటన, అందం చూసి ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. ఇక రామ్ రెడ్ సినిమాలో యామినిగా నటించిన నివేత పేతురాజ్ ది చిన్న పిల్లల మనస్తత్వం అంట. ఆ విషయాన్ని నివేత పేతురాజే చెబుతుంది. తనది చిన్న పిల్లల మనస్తత్వం అని.. చిన్న పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తొందరగా అందరితో కలవలేరని.. కలిసిన తర్వాత వాళ్ళ అల్లరి మాములుగా ఉండదని.. తాను కూడా అంతే అంటుంది.

తాను కూడా అందరితో తొందరగా కలవలేనని.. కానీ కాసేపటి తర్వాత నా అల్లరి భరించడం ఎవరి వల్లా కాదని చెబుతుంది. ముందు కామ్ గా డీసెంట్ గానే కనిపిస్తానని.. కానీ తర్వాత నన్నెవరూ ఆపలేరంటుంది. ఇక సినిమా షూటింగ్స్ అప్పుడు కూడా సెట్ లోకి ఎంటర్ అవగానే కాసేపు కామ్ గా సైలెంట్ గానే ఉంటాను. తర్వాత మాత్రం రెచ్చిపోయి అందరితో కలిసిపోతాను. 

మనం అందరితో ఎంత త్వరగా కలిసిపోతే అంత బాగా మనం నటించే సన్నివేశాలు వస్తాయంటుంది నివేత పేతురాజ్. మనం అందరితో ఎంత కలివిడిగా ఉంటామో అనేది అది ఖచ్చితంగా మన నటన మీద ప్రభావం చూపుతుంది అంటూ లెక్చర్ ఇస్తుంది ఈ పాప.

Nivetha Pethuraj about Her Mentality :

Nivetha Pethuraj Latest chit chat updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ