బిగ్ బాస్ హౌస్‌లోకి గ్లామర్‌గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ అంతే గ్లామర్‌గా ఒకే ఒక్క వారంలోనే ఎలిమినేట్ అవడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. గత వారం టివి 9 దేవిని అలానే బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి విమర్శలు మూట గట్టుకుంటే.. ఈ వారం అసలు ఆ అమ్మాయి హౌస్‌లో ఎలాంటి పెరఫార్మెన్స్ ఇస్తుందో కూడా చూడకుండానే ఒకే ఒక్క వారంలోనే ఎలిమినేట్ చెయ్యడంతో స్వాతి దీక్షిత్‌కే మింగుడుపడలేదు. అలాగే ఛానల్స్‌లో హౌస్ మేట్స్ మీద నిప్పులు చెరగడమే కాదు.. నాగ్ అసలు స్వాతి దీక్షిత్ ఆట ఆడనందుకే ఎలిమినేట్ చేశారనడం బాధగా ఉందని చెప్పింది. ఇక మొదటి రెండు వారాల్లో సూర్య కిరణ్, కరాటే కళ్యాణిలు ఎలిమేనేట్ అవడం వింతేమీ కాకపోయినా.. మూడో వారంలో దేవి, నాలుగో వారంలో స్వాతి ఎలిమినేట్ అవడం ఎవరికీ నచ్చలేదు.
అయితే పెద్దగా ఫేమ్ లేని స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ ద్వారా క్రేజ్ పెంచుకుందామనుకుంది. అసలు అవకాశాలే లేని స్వాతి దీక్షిత్‌కి ఇప్పుడు అభిమానుల సపోర్ట్ ఏ రేంజ్‌లో ఉందో చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే. అసలు స్వాతి దీక్షిత్‌కి అభిమాన సంఘాలు ఉందనేదే షాకయితే.. ఇప్పుడా అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ముందు ఆమెని మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి పంపాలంటూ ధర్నా చెయ్యడం మరీ విడ్డురంగా ఉంది.
అసలు స్వాతి దీక్షిత్‌ది నిజమైన ఎలిమినేషన్ కాదని, ఆమెని ప్రేక్షకులు ఎలిమినేట్ చేశారనేది అబద్దమని, కావాలనే బిగ్ బాస్ వాళ్ళు స్వాతి దీక్షిత్ ని తప్పించారంటూ.. మళ్ళీ స్వాతి దీక్షిత్ తో బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇప్పించాలంటూ ఆమె అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ధర్నాలు చేపట్టారు. అయితే స్వాతి దీక్షిత్ కి అభిమానులు, ప్రేక్షకుల సపోర్ట్ ఉందని బిగ్ బాస్‌కి తెలియడానికి ఈ ధర్నాలు చేస్తున్నామంటూ చెబుతున్నారు.