Advertisementt

‘ఆచార్య’.. కాజల్ పెళ్లంటోంది.. కదలిక ఏమైనా?

Sat 10th Oct 2020 11:06 PM
acharya,kajal agarwal,chiranjeevi,no update,kajal agarwal marriage  ‘ఆచార్య’.. కాజల్ పెళ్లంటోంది.. కదలిక ఏమైనా?
No Update on Chiranjeevi Acharya Movie ‘ఆచార్య’.. కాజల్ పెళ్లంటోంది.. కదలిక ఏమైనా?
Advertisement
Ads by CJ

అన్ని సినిమాలు షూటింగ్స్ షూటింగ్స్ అంటూ సెట్స్ మీద హడావుడి చేస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాల దగ్గర నుండి.. చిన్న సినిమాల వరకు షూటింగ్స్ మొదలైపోయాయి. కానీ చిరంజీవి ఆచార్య అప్ డేట్ మాత్రం లేదు. అన్ని సినిమాలు షూటింగ్స్ కి వెళ్లడం ఆలస్యం.. ఆయా సినిమాల ప్రెస్ నోట్స్ మీడియాకి వచ్చేస్తున్నాయి. కానీ ఆచార్య షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియడం లేదు. ఆఖరుకి రాజమౌళి కూడా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో RRR షూటింగ్ మొదలుపెట్టేశాడు. ఇక రామ్ చరణ్ కూడా ఆచార్యపై స్పష్టత ఇవ్వడం లేదు. అయితే కాజల్ అగర్వాల్ కరోనా లాక్ డౌన్ లోనే పెళ్లాడుతుంది. ఈనెల ముప్పైన కాజల్ పెళ్లి జరగబోతుంది. హోటల్ లో కుటుంబ సభ్యుల మధ్యన పెళ్లి జరిగినా ప్రస్తుతం పెళ్లి షాపింగ్, బ్యాచులర్ పార్టీలు, మెహిందీ, సంగీత్ అంటూ బోలెడంత హడావిడి ఉంటుంది. మరి కాజల్ పెళ్లి అయ్యాకా ఆచార్య షూటింగ్ మొదలవుతుందా?

లేదంటే చిరు ఆగమన్నాడని కొరటాల ఇంకా ఆచార్య షూటింగ్ షెడ్యూల్ వెయ్యలేదా? కారణం ఏమైనా ఆచార్య షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. కాజల్ అగర్వాల్ వచ్చేవరకు కనీసం ఆమె లేని సన్నివేశాల చిత్రీకరణ కూడా చెయ్యొచ్చు. కాని ఆచార్య టీం మాత్రం కదలడం లేదు. మరి కాజల్ అగర్వాల్ పెళ్లే ఆచార్య షూటింగ్ కి అడ్డమా అంటే తెలియదు. మరి కాజల్ పెళ్లి తర్వాత 16 రోజుల పండగ లోపులోనే ఆచార్య సినిమా షూటింగ్ కి వచ్చినా వచ్చేస్తుంది. ఎందుకంటే తాను పెళ్లి తర్వాత నటిస్తానని క్లియర్ గా చెప్పింది కాబట్టి. మరి ఆచార్య షూటింగ్ విషయమై కనీసం ఓ అప్ డేట్ ఇస్తే బావుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ తొందరపడుతున్నారు.

No Update on Chiranjeevi Acharya Movie:

Acharya: Kajal Assures, Chiru Has No Qualms

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ