లాక్డౌన్ వల్ల వినోదరంగానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. సినిమాలు లేక, టీవీ ప్రోగ్రామ్స్ షూటింగ్స్ ఆగిపోయి రోజు వారి సినిమా కార్మికులే కాదు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలో చాలామంది మానసిక ఒత్తిడికి గురయ్యారు. జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడట. లాక్డౌన్ లో పనులేమీ లేక ఇల్లు మీద తీసుకున్న అప్పుకి నెలవారీ వడ్డీ కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడట.
అప్పుడు పడ్డ మనోవేదనికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. కానీ మళ్ళీ వాళ్ల అమ్మ గుర్తొచ్చి ఆగిపోయాడని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చిన అవినాష్, ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా అవతారమెత్తిన అవినాష్, బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా వచ్చాడు. కమెడియన్ గా పేరు తెచ్చుకున్న అవినాష్, లాక్డౌన్ వల్ల అన్ని ఇబ్బందులు పడ్డాడంటే, రోజు వారి కూలీలు, కార్మికుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఐతే ప్రస్తుతం బిహ్ బాస్ హౌస్ లో చాలా సరదాగా గడుపుతున్నాడు. హౌస్ లో తనదైన కామెడీని పండిస్తూ అందర్నీ నవ్విస్తున్నాడు. అటు బిగ్ బాస్ కూడా ప్రతీవారం అవినాష్ పై ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రతీ శుక్రవారం అవినాష్ హైలైట్ అవుతూ వస్తున్నాడు.