Advertisementt

అదృష్టమంటే ఆ అమ్మాయిదే..!

Sat 10th Oct 2020 11:44 AM
uppena,krithi shetty,vaishnav tej,shyam singha roy,nani  అదృష్టమంటే ఆ అమ్మాయిదే..!
Uppena Heroine getting offers.. అదృష్టమంటే ఆ అమ్మాయిదే..!
Advertisement
Ads by CJ

ఆమె చేసిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కేవలం రెండు పాటలు మాత్రమే బయటకి వచ్చాయి. అందులో ఒకటి రెండు నిమిషాల వీడియో సాంగ్ కాగా, మరొకటి జస్ట్ లిరికల్ సాంగ్. కానీ ఆ రెండు పాటల్లో కనిపించిన ఆ హీరోయిన్ కి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు క్రితిశెట్టి. వైష్ణవ్ తేజ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా క్రితిశెట్టి కనిపిస్తుంది.

సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఐతే ఇందులో పాటలు రిలీజ్ చేసినప్పటి నుండి క్రితిశెట్టికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. దాంతో కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా క్రితిశెట్టి నాని సినిమాలో ఒకానొక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యాయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రంలో క్రితిశెట్టిని హీరోయిన్ గా తీసుకుందామని చూస్తున్నారట.

ఈ మేరకు సంప్రదింపులు పూర్తయ్యాయట. ఆ సినిమాలో అవకాశం వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఉప్పెన రిలీజ్ కాకుండానే ఇంతలా అవకాశాలు వస్తుంటే రిలీజ్ అయ్యాక ఆమె రేంజ్ మారిపోతుందని చెప్పడంలో సందేహమే లేదు. మరి చూడాలి ఏంజ్ జరగనుందో..!

Uppena Heroine getting offers..:

Uppena Heroine getting offers..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ