Advertisementt

సునీల్ కోసం త్రివిక్రమ్.. షాకింగ్ న్యూస్!

Mon 12th Oct 2020 08:46 PM
trivikram srinivas,recommend,sunil,allu arjun,sukumar,pushpa movie  సునీల్ కోసం త్రివిక్రమ్.. షాకింగ్ న్యూస్!
Trivikram recommendation for Sunil for role in Pushpa సునీల్ కోసం త్రివిక్రమ్.. షాకింగ్ న్యూస్!
Advertisement
Ads by CJ

సునీల్ హీరోగా అవకాశాలు తగ్గాక అటు విలన్‌గాను, ఇటు కమెడియన్‌గానూ సక్సెస్ అవడానికి నానా పాట్లు పడుతున్నాడు. కమెడియన్‌గా సక్సెస్ కాలేకపోయాడు. మరోపక్క సునీల్ విలన్‌గా నటించిన కలర్ ఫోటో విడుదలకు ముస్తాబు అవుతుంది. అయితే హీరోగా అవకాశాలు తగ్గాక సునీల్ తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్‌నే నమ్ముకున్నాడు. త్రివిక్రమ్ కూడా తన రెండు సినిమాల్లో సునీల్‌కి మంచి కేరెక్టర్ ఇవ్వలేకపోయాడు. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు ఫ్రెండ్ సునీల్ కోసం ఓ పని చేశాడని.. ఆ పని తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే అంటున్నారు.

అదేమిటంటే త్రివిక్రమ్.. సునీల్ కోసం మరో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించే సినిమాలో ఓ పాత్ర కోసం బన్నీ దగ్గరకి వెళ్లి పాన్ ఇండియా మూవీ పుష్పలో ఓ పాత్ర సునీల్ కి ఇవ్వమని... ఈ విషయంపై సుకుమార్ తో మాట్లాడమని..  బన్నీని రిక్వెస్ట్ చేసినట్లుగా సినీవర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే బన్నీ కూడా త్రివిక్రమ్ రిక్వెస్ట్‌ని సుకుమార్ ముందుంచగా.... సుకుమార్ అటు బన్నీ మాట తీసెయ్యలేక పుష్పలో ముందు అనుకున్న ఓ నటుడిని తప్పించి మరీ సునీల్ కి అవకాశం ఇచ్చినట్టుగా ప్రచారం షురూ అయ్యింది.

అయితే త్రివిక్రమ్ చెప్పాడు కాబట్టే బన్నీ.. సుకుమార్‌తో మాట్లాడాడట. లేదంటే సుకుమార్ ముందు అనుకున్న నటుడే ఆ పాత్రకి పర్ఫెక్ట్ అట. కానీ అల్లు అర్జున్ చెప్పాక బావుండదనే పుష్పలో ఆ పాత్రని సునీల్‌కి వచ్చేలా సుకుమార్ చేశాడట. సుకుమార్ చేతిలో పని కనుక జరిగిపోయింది. లేదంటే లేదు. మరి సునీల్ కోసం త్రివిక్రమ్ ఇలా చెయ్యడం చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే.

Trivikram recommendation for Sunil for role in Pushpa:

Trivikram for Sunil.. shocking news

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ