Advertisementt

శేఖర్ కమ్ముల అంటే.. అందుకు ఫిక్స్ అవ్వాల్సిందే!

Thu 15th Oct 2020 12:24 AM
sekhar kammula,love story,movie,re shoots,sai pallavi,naga chaitanya  శేఖర్ కమ్ముల అంటే.. అందుకు ఫిక్స్ అవ్వాల్సిందే!
Sekhar Kammula Love Story Movie in Re shoots శేఖర్ కమ్ముల అంటే.. అందుకు ఫిక్స్ అవ్వాల్సిందే!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో శేఖర్ కమ్ముల సినిమాలంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ అయ్యే ఉంటాయి. హీరోలను చక్కటి లవర్ బాయ్స్‌లా శేఖర్ హీరోల కేరెక్టర్స్‌ని రాసుకుంటాడు. హీరోయిన్స్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత విషయంలోనూ ఎక్కడా తగ్గడు. ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరోతో సినిమా చెయ్యకపోయినా.. శేఖర్ కమ్ముల సినిమాలను మీడియం రేంజ్ హీరోలు ఇష్టపడుతున్నారు. అయితే శేఖర్ కమ్ములతో సినిమా అంటే హీరో అయినా హీరోయిన్ అయినా రీ షూట్‌లకి సిద్దపడాలట. ఎందుకంటే శేఖర్ కమ్ముల అనుకున్న సీన్ పర్ఫెక్ట్‌గా రాకపోతే అస్సలూరుకోడట. చెక్కిందే చెక్కి ఆ సీన్ పర్ఫెక్షన్ వచ్చేవరకు వదలడట. ఏ డైరెక్టర్ అయినా అంతే కానీ. శేఖర్ కమ్ముల స్టయిల్ వేరంటున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య - సాయి పల్లవిల కాంబోలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ పరిస్థితి కూడా అదే అంటున్నారు.

అంటే కరోనా రాకముందు ఆల్ మోస్ట్ ఫినిష్ అనుకున్న లవ్ స్టోరీ.. కరోనా తర్వాత కొద్దిమేర షూటింగ్ చేస్తే అయిపోతుంది. కానీ శేఖర్ కమ్ములకి కరోనాకి ముందు చేసిన షూటింగ్ రషెస్ చూడగా.. కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అవసరమని భావించి... వెంటనే చైతు - సాయి పల్లవిలతో రీ షూట్ మొదలు పెట్టాడంటున్నారు. ఇప్పటికే సినిమా పూర్తవ్వాల్సింది కాస్తా.. మళ్ళీ రీ షూట్స్ వలనే చాలా టైం పట్టేస్తుంది అంటున్నారు. ఇక దాని కోసం చైతు - సాయి పల్లవిలు లవ్ స్టోరీ కోసం మరికొన్ని డేట్స్ కేటాయించారని ఫిలింనగర్ టాక్. ఎలాగూ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యలేదు కాబట్టి.. హడావిడిగా సినిమా షూటింగ్ పూర్తి చెయ్యక్కర్లేదు. 

అందులోనూ కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ అయిన అప్పుడే ప్రేక్షకులు రారు... కాబట్టి సినిమా సంక్రాంతి వరకు పూర్తయినా నో ప్రాబ్లెమ్. అది శేఖర్ కమ్ముల ధైర్యం. అందుకే ఇలా రీ షూట్స్ మీదే కూర్చున్నాడంటున్నారు.

Sekhar Kammula Love Story Movie in Re shoots:

Heroes ready for re shoots movie with Sekhar Kammula

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ