Advertisementt

అఖిల్- సురేందర్ కాంబోలో క్రేజీ హీరోయిన్..?

Tue 13th Oct 2020 12:00 PM
rashmika mandanna,akhil,surender reddy,telugu,akhil5  అఖిల్- సురేందర్ కాంబోలో క్రేజీ హీరోయిన్..?
Crazy heroine in Akhil Movie..? అఖిల్- సురేందర్ కాంబోలో క్రేజీ హీరోయిన్..?
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద పరాజయం చవిచూసాయి. తన కెరీర్లో నాలుగవ చిత్రంగా వస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. బొమ్మరిల్లు వంటి సూపర్ చిత్రాన్ని తీసిన భాస్కర్, మోస్ట్ ఎలిజబుల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటించింది.

ఐతే తాజాగా అఖిల్ ఐదవ చిత్రం ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో సైరా చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ మూవీ తెరకెక్కుతోంది. దీనికి సురేందర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. రష్మిక మందన్న అయితే బాగుంటుందేమోనని ఆలోచిస్తున్నారట.

ఐతే రష్మిక స్టార్ హీరోయిన్..ఆమె హీరోయిన్ గా సినిమా అంటే పారితోషికం భారీగా ఇచ్చుకోవాల్సిందే. మరో పక్క రష్మిక, స్టార్ హీరోల సినిమాల్లోనే నటిస్తానని తెలిపినట్లు వార్తలు వచ్చాయి. మరి అఖిల్ కోసం రష్మిక వస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ రష్మిక హీరోయిన్ గా వస్తే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Crazy heroine in Akhil Movie..?:

Crazy heroine in Akhil Movie..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ