RX 100 సినిమాతో అనుకోకుండా హిట్ కొట్టేసిన అజయ్ భూపతి తన తదుపరి చిత్రం మహాసముద్రం స్క్రిప్ట్‌తో ప్రతి ఒక్క మీడియం హీరో గడపా ఎక్కాడు. ఎక్కని గుమ్మం లేదంటే నమ్మాలి. చివరికి అజయ్ భూపతికి శర్వానంద్ దొరికాడు. అలాగే ఈ సినిమాలో సిద్దార్ద్ మరో కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లు తెర మీదకొచ్చినా చివరికి మహా సముద్రం హీరోయిన్ గా అదితి రావు పేరు ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కూడా అంటే RX 100లో హీరోయిన్ పాయల్ రాజపుత్ నెగెటివ్ రోల్ అంటే బోల్డ్ రోల్ ప్లే చేసినట్టుగా.. మహాసముద్రం లోను అదితి ది నెగెటివ్ రోల్ అంటూ ప్రచారం జరుగుతుంది.
RX 100 సినిమాలో అతి పెద్ద ట్విస్ట్ హీరోయిన్ నే నెగటివ్ గా లీడ్ చెయ్యడం. ఇప్పుడు అదే ఫార్ములాని అజయ్ భూపతి మహాసముద్రానికి వాడేస్తున్నాడట. హీరోయిన్ పాత్రలో నెగిటివ్ షేడ్స్‌లో చూపించబోతున్నాడట. మహా సముద్రంలో మహా పాత్ర అంటే హీరోయిన్ పాత్ర చుట్టూనే సినిమా కథ తిరుగుతుందట. అయితే RX లోలా మరీ కామపిచ్చి ఉన్న కేరెక్టర్ కాకుండా వేరే యాంగిల్ లో నెగెటివ్ షేడ్స్ ని హీరోయిన్ పాత్రకి పెట్టబోతున్నాడట. అలాగే కథ మొత్తం విశాఖ సముద్ర తీరంలోనే సాగుతుంది అని... అందుకే హీరోయిన్ ప్లస్ సముద్రంతో టైటిల్ పెట్టారని.. మహా హీరోయిన్ పాత్ర అలాగే సముద్రం నేపథ్యంలోనే సినిమా ఉంటుంది కాబట్టి దానికి మహా సముద్రం అనే టైటిల్‌ని అజయ్ భూపతి ఫిక్స్ చేసుకున్నాడట.