Advertisementt

బిగ్‌బాస్: కమెడియన్స్‌నే నమ్ముకుంటున్నాడా?

Sat 17th Oct 2020 09:01 PM
nagarjuna,bigg boss 4,jabardasth,comedian,avinash  బిగ్‌బాస్: కమెడియన్స్‌నే నమ్ముకుంటున్నాడా?
One More Jabardasth Comedian for Bigg Boss Telugu బిగ్‌బాస్: కమెడియన్స్‌నే నమ్ముకుంటున్నాడా?
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్ సీజన్ 4 మొదలైనప్పటి నుండి ఆ షో మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా నాగ్ ఎపిసోడ్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది బిగ్‌బాస్ యాజమాన్యం. నాగార్జున హోస్టింగ్‌లో శని, అది వారాల బిగ్‌బాస్ హౌస్ కోపాలు, తాపాలు, లేఖలు, నాగ్ క్లాస్‌లతో కళకళలాడుతుంది. అయితే బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ముగ్గురు రాగా అందులో జబర్దస్త్ అవినాష్ కామెడీ మాత్రం బాగా హైలెట్ అయ్యింది. ఎప్పుడూ కామెడీతోనే ఆకట్టుకునే అవినాష్ గత రాత్రి సోహైల్ మీద ఫైర్ అయ్యాడు. మీ సంచాలక్ జాబ్ కరెక్ట్‌గా లేదని.. సంచాలక్‌గా ఫెయిల్ అయ్యాడంటూ సోహైల్ మీద విరుచుకుపడగా.. నాగ్‌కి ఇచ్చిన మాటతో సోహైల్, అవినాష్ దగ్గర కూల్‌గా ఉండి లోపలికెళ్ళి కుర్చీ మీద చెయ్యితో గట్టిగా కొట్టుకున్నాడు.

ఇక ఎప్పటిలాగే అఖిల్, మెహబూబ్‌లు సోహైల్‌ని సముదాయించారు. నాకు కోపమొస్తే కోప్పడతా, కామెడీ చెయ్యాలంటే కామెడీ చేస్తా నేనింతే అంటూ అవినాష్ వీరలెవల్లో రెచ్చిపోయాడు. ఇక జబర్దస్త్ అవినాష్‌ని నాగార్జున ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తున్నాడు. ఎందుకంటే అవినాష్ కామెడీ బాగా హెల్ప్ అవుతుంది. ఇక తాజాగా గంగవ్వ ప్లేస్‌లోకి మరో జబర్దస్త్ కమెడియన్‌ని బిగ్ బాస్ తీసుకురాబోతుంది అని.. అది ఎవరనేది సీక్రెట్ గా ఉంచాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యిందట. అందుకే హౌస్‌లోకి అడుగుపెట్టే ఆ కమెడియన్ ఎవరనేది బిగ్‌బాస్‌హౌస్‌లోనే చూసి తెలుసుకోవాలేమో.

One More Jabardasth Comedian for Bigg Boss Telugu:

Bigg Boss hopes on Jabardasth Comedians

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ