Advertisementt

‘వకీల్‌సాబ్‌’కు పవన్‌ కళ్యాణ్‌ సూచనలు

Sun 18th Oct 2020 06:32 PM
pawan kalyan,suggestions,dil raju,vakeel saab,shooting  ‘వకీల్‌సాబ్‌’కు పవన్‌ కళ్యాణ్‌ సూచనలు
Pawan Kalyan suggestions to Dil Raju about Vakeel Saab ‘వకీల్‌సాబ్‌’కు పవన్‌ కళ్యాణ్‌ సూచనలు
Advertisement
Ads by CJ

పవన్ సినిమా చేస్తే చాలు.. మాకు ఇంకేం అక్కర్లేదు. ఆయన కేవలం యాక్ట్ చేస్తే చాలు ప్రమోషన్స్ కి రాకపోయినా ఇబ్బంది లేదు. పవన్ క్రేజ్ ఉంటే చాలు సినిమా ఆడేస్తుంది అనుకుని నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతలేమైపోతే నాకెందుకు వచ్చానా.. నటించినా సినిమా పూర్తయ్యిందా అన్నట్టుగా ఉంటాడు కానీ.. సినిమాని ప్రమోట్ చేద్దామనే ధ్యాసే ఉండదు. ఇక దర్శక నిర్మాతలే పవన్ పేరు చెప్పుకుని ప్రమోషన్ తంటాలు పడతారు. అయితే పవన్ మైండ్ సెట్ మారింది అంటున్నారు. వకీల్ సాబ్ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్మాత దిల్ రాజుకి కొన్ని సూచనలు చేశాడట.

ఇప్పటివరకు షూటింగ్ ఆగిపోయి సినిమా మీద క్రేజ్ తగ్గుతుంది. ఇక ఇప్పుడు షూటింగ్ మొదలయ్యింది. విడుదల తేదీ ఎప్పుడు అనౌన్స్ చేసినా సినిమాపై క్రేజ్ పెరిగేలా చూడమని అందులో భాగంగా వకీల్ సాబ్ పోస్టర్స్ కానీ, మరేదన్నా కానీ ఒక్కొక్కటిగా వదులుతూ సినిమాపై హైప్ పెంచమని చెబుతున్నాడట. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ వదిలేస్తే ఫ్యాన్స్ పబ్లిసిటీ బావుంటుంది అని.. ఫ్యాన్స్ మౌత్ పబ్లిసిటీతోనే సినిమాపై క్రేజ్ పెరుగుతుంది అని.. అందుకే ఫ్యాన్స్ మెచ్చేలా పోస్టర్స్ సిద్ధం చెయ్యమని పవన్ దర్శకనిర్మాతలకు చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్. 

ఇక దసరా తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడట. 

Pawan Kalyan suggestions to Dil Raju about Vakeel Saab:

Pawan Kalyan ready to Vakeel Saab Shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ