Advertisementt

మోనాల్‌ని నమ్ముకున్నోడే బుక్ చేశాడు

Sun 25th Oct 2020 10:08 AM
bigg boss,nominations,monal gajjar,akhil,abhijeet,monal in nomination  మోనాల్‌ని నమ్ముకున్నోడే బుక్ చేశాడు
Bigg Boss: Monal Gajjar in Danger Zone మోనాల్‌ని నమ్ముకున్నోడే బుక్ చేశాడు
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్‌లోకి ఎంటర్ అయ్యింది మొదలు హీరోయిన్ మోనాల్ గజ్జర్ క్యూట్ గా అబ్బాయిలను పడెయ్యడంలో నిమగ్నమైంది. అయితే ఏడవడం, లేదంటే ఇద్దరు అబ్బాయిలతో బిజీగా ఉండడమే మోనాల్ పని. మోనాల్ వలన హౌస్‌లో అఖిల్ - అభిజిత్‌ల మధ్య వార్ నడుస్తుంది. ఇప్పటికీ అఖిల్ - అభిజిత్‌ల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కారణం మోనాల్ మోనాల్. మోనాల్ అభిజిత్ దగ్గర అఖిల్ మాటలు, అఖిల్ దగ్గర అభి మాటలు ఇలా మ్యానేజ్ చేస్తుంది. దానితో వాళ్ళ మధ్యన ఫైటింగ్.. నాగ్ క్లాస్. దానితో అభిజిత్ కి లైట్ వెలిగి మోనాల్‌తో తెగ తెంపులు చేసుకున్నాడు. ఇక మిగిలింది అఖిల్. అఖిల్ అయితే మోనాల్ కోసం అన్ని త్యాగాలే. మోనాల్ ఫేక్ ఎలిమినేషన్‌కి వెళితే భోరుమన్నారు.

మరి మోనాల్ అఖిల్‌ని పిచ్చగా నమ్మితే.. ఈ వారం ఎలిమినేషన్స్‌లో అఖిల్ మోనాల్‌ని మోసం చేసాడు. మోనాల్‌ని అడ్డంగా ఇరికించాడు. నమ్ముకున్నోడే నట్టేట ముంచేశాడు. ఈసారి మోనాల్ సేవ్ అవుతుంది అంటే నమ్మకం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో మోనాల్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కుమార్ సాయికి బాగా ఓట్లు వచ్చాయట. ఇక గ్లామర్ గర్ల్, అందులోను లవ్ ట్రాక్ నడుపుతున్న మోనాల్‌కి ఓట్లు ఎక్కువగా రాకపోయినా బిగ్ బాస్ యాజమాన్యం ఏదో చేసి మోనాల్ ని ఇంట్లోనే ఉంచి కుమార్ సాయిని ఎలిమినేట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో బిగ్ బాస్ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి.

మోనాల్ ఏడుపుని బుల్లితెర ప్రేక్షకులు భరించడం కష్టంగా మారింది. ఆమె శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ గ్లామర్‌ని బుల్లితెర ప్రేక్షకుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు. యూత్ ఎంజాయ్ చేస్తున్న పెద్దవాళ్ళకి చిరాకు పుడుతుంది. మరి మోనాల్ కి ఈవారం ఉద్వాసన తప్పేలా లేదు. మరోపక్క అరియనా కూడా డేంజర్ జోన్ లో ఉందని అంటున్నారు. అయితే అరియనా - మోనాలా అంటే అందరూ అరియనాకే ఓటేస్తున్నారు. మరోపక్క అభిజిత్ ఓట్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉంటే.. అవినాష్ కి జబర్దస్త్ అండ ఉంది. అలాగే నోయెల్ కి ఆయన టీం ఉంది. మరి ఈ వారం అరియనా లేదా మోనాల్ హౌస్ నుండి వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు.

Bigg Boss: Monal Gajjar in Danger Zone :

Bigg Boss: Akhil nominates Monal Gajjar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ