Advertisementt

ఆ అన్నదమ్ముల నుంచి అప్డేట్‌ రాలేదేంటి?

Thu 29th Oct 2020 12:18 AM
sai tej,vaishnav tej,movies,uppena,solo brathuke so better,silent,dasara  ఆ అన్నదమ్ముల నుంచి అప్డేట్‌ రాలేదేంటి?
sai tej and vaishnav tej silent on Dasara ఆ అన్నదమ్ముల నుంచి అప్డేట్‌ రాలేదేంటి?
Advertisement
Ads by CJ

నిన్న సినిమాల విషయంలో దసరా హడావిడి అంటే ఏమిటో సోషల్ మీడియా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సోషల్ మీడియా అంటే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాలలో ఒక్కో సినిమా పోస్టర్స్, కొత్త సినిమాల అనౌన్సమెంట్స్, కొత్త సినిమాల దసరా విషెస్ పోస్టర్స్, కొంతమంది హీరోల రిలీజ్ డేట్స్, టీజర్స్, అబ్బో మాములుగా లేదు దసరా హడావిడి. కేవలం సినిమాల విడుదల మాత్రమే లేదు.. కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి ఈ దసరాకి షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తే. షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలు దసరా విషెస్ పోస్టర్స్ తోనూ, అలాగే షూటింగ్ చివరిలో ఉన్న సినిమాలు టీజర్ తో హోరెత్తించాయి. మరి ఇంత హడావిడిలో ఓ అన్నదమ్ములిద్దరూ మిస్ అయ్యారు.

ఆ అన్నదమ్ములిద్దరూ సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి కూడా. వాళ్ళే మెగా మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్‌లు. వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన అయితే మార్చిలో విడుదల కావాల్సింది. కానీ కరోనా. కొంతమంది ఓటీటీ అన్నా వైష్ణవ్ తేజ్ మాత్రం చల్ కుదరదు నా సినిమా థియేటర్స్ అని కూర్చున్నాడు. ఇక సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యింది. మొన్నామధ్యన ఆ సినిమా ఓటీటీ అన్నారు. 

మరి ఈ దసరాకైనా అన్నదమ్ములు క్లారిటీ ఇస్తారనుకుంటే.. అటు సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు కానీ.. వైష్ణవ్ తేజ్ ఉప్పెన కానీ ఈ దసరాకి పోస్టర్ కానీ.. రిలీజ్ అనౌన్సమెంట్ కానీ ఇవ్వలేదు. మరి దసరా విషెస్ పోస్టర్స్ ఇవ్వకపోయినా విడుదల డేట్ ఇస్తే అయినా బావుండేది. మెగా ఫ్యాన్స్ ఖుష్ అయ్యేవారు. కానీ అన్నదమ్ముల సైలెంట్ వెనుక కారణమేమిటో వాళ్ళకే తెలియాలి. 

sai tej and vaishnav tej silent on Dasara :

No update from sai tej and vaishnav tej film on dasara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ