బిగ్ బాస్ సీజన్ 4 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున గత వారం తన సినిమా వైల్డ్ డాగ్ షూటింగ్ షెడ్యూల్ కోసం మనాలి వెళ్లాల్సి రావడంతో ఆయన బిగ్ బాస్ బాధ్యతలను కోడలు సమంత కి అప్పజెప్పాడు. కోడలు సమంత కూడా బిగ్ బాస్ హోస్ట్ గా బాగానే హ్యాండిల్ చేసింది. కానీ నాగార్జున లేని లోటు మాత్రం తెలిసింది. సమంత ఒక హీరోయిన్, ఆమె అందం, ఆకర్షణ, స్టయిల్ అన్ని ఓకె.. బట్ మాట్లాడే విధానంలో నాగార్జున ని క్రాస్ చెయ్యలేకపోయింది. అందుకే మరో 20 రోజుల్ షూటింగ్ మనాలిలో ఉన్నప్పటికీ.. ఈ శని, ఆదివారాలు ఎపిసోడ్స్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున కోసం గట్టిగానే ఖర్చు పెడుతుంది.
బిగ్ బాస్ శని వారం ఎపిసోడ్ కి కూడా సమంత నే హోస్ట్ అంటూ ప్రచారం జరిగినా ఇప్పుడు తాజాగా నాగ్ రంగంలోకి దిగుతున్నాడు. మరి బిగ్ బాస్ ఓ హెలి కాప్టర్ లో నాగ్ ని తీసుకొచ్చి విమానమెక్కించుకుని మరీ హైదెరాబాదులో ల్యాండ్ అయ్యేలా చేసింది. మరి కులుమనాలి నుండి నాగార్జున బిగ్ బాస్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేసాడు. ఇప్పటికే శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ పూర్తయ్యి.. ప్రోమో ని విడుదల చేసింది స్టార్ మా. అందులో నాగ్ కులుమనాలి నుండి హెలి కాఫ్టర్, విమానం ప్రయాణాలను స్టార్ మా ఆ ప్రోమో లో రిలీజ్ చెయ్యడం చూస్తే నాగ్ కోసం బిగ్ బాస్ ఎక్కడా తగ్గకుండా భారీ ఏర్పాట్లే చేస్తుంది అనిపించడం లేదూ..!