Advertisementt

ఈవారం.. బిగ్‌బాస్‌లో బిగ్‌ ట్విస్ట్..?

Sun 01st Nov 2020 10:41 PM
nagarjuna,bigg boss,eliminations,big twist  ఈవారం.. బిగ్‌బాస్‌లో బిగ్‌ ట్విస్ట్..?
This week.. Big Twist in Bigg Boss ఈవారం.. బిగ్‌బాస్‌లో బిగ్‌ ట్విస్ట్..?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. వీక్ డేస్ లో బిగ్ బాస్ ఎలా ఉన్నప్పటికీ.. శని, ఆదివారాలు ఎపిసోడ్స్ కి నాగార్జున ఇచ్చే బూస్ట్ తో కంటెస్టెంట్స్ కూడా హుషారుగా టాస్క్ పెరఫార్మెన్స్ ఇస్తున్నారు. శనివారం నాగ్ క్లాస్, ఆదివారం ఫన్నీ గా గేమ్స్ ఆడడంతో పాటుగా. ఎలిమినేషన్స్ ప్రక్రియతో హౌస్ లొ అంతా ఎమోషన్ కనబడుతుంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ లో ఉన్న మోనాల్, లాస్య, అఖిల్, అరియనాలలో లాస్య, అఖిల్ లు శనివారం సేవ్ అవ్వగా.. ఆదివారం వచ్చేసరికి ముందు మోనాల్ సేవ్ అయితే.. తర్వాత అరియానని సేవ్ చేసారు.

ఇక అమ్మ రాజశేఖర్ - మెహబూబ్ ఇద్దరు నామినేషన్స్ లో మిగలగా నాగార్జున వారిద్దని కన్ఫెషన్ రూమ్ లో కూర్చోబెట్టి.. హౌసెమెట్స్ అందరిని మీరు ఈ హౌస్ లో అమ్మ ఉండాలనుకుంటున్నారా? మెహబూబ్ ఉండాలనుకుంటున్నారా అని అడగగా.. హౌస్ మేట్స్ లో ఎక్కువశాతం మెహబూబ్ హౌస్ లో ఉండాలంటూ ఓట్స్ వేశారు. అమ్మ హౌస్ లో ఉండాలని అరియనా, అవినాష్ ఓట్స్ వేశారు. ఇక దానితో నాగ్.. అమ్మ తోనూ, మెహబూబ్ తో మాట్లాడి మెహబూబ్ ని హౌస్లోకి పంపి.. అమ్మ రాజశేఖర్ ని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ స్టేజ్ మీదకి పిలిచినట్టే పిలిచి అమ్మ రాజశేఖర్ ని ఎలిమినేట్ చెయ్యడం లేదని.. అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేసి.. ఈవారం నో ఎలిమినేషన్స్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

అయితే అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేసింది నోయెల్ అంటూ నాగార్జున ఆ ట్విస్ట్ రివీల్ చేసాడు. అంటే నోయెల్ నేను ఎలాగూ హౌస్ లో ఉండడం లేదుగా.. అందుకే ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చెయ్యొద్దూ అంటూ నాగ్ దగ్గర మాట తీసుకోవడంతో.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరూ బయటికి వెళ్ళలేదు. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం నాగ్ ని నన్ను బయటికి పంపేయండి అంటూ రిక్వెస్ట్ చేసినా నాగ్ వినకుండా నెక్స్ట్ వీక్ కలుద్దాం అంటూ జారుకున్నాడు.

This week.. Big Twist in Bigg Boss:

Bigg Boss: No eliminations in this week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ