బిగ్ బాస్ సీజన్ 4 సగం జర్నీ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఇక అసలైన ఆట ఇప్పుడు మొదలయ్యింది అంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్యన చిచ్చు రగిలించాడు. మొన్న శనివారం ఎపిసోడ్‌లోనే శత్రువులను మిత్రులుగా చేసి.. మిత్రులను శత్రువులుగా ఒకే ఒక్క వీడియో క్లిప్పింగ్స్ తో మార్చేసిన బిగ్ బాస్ ఇప్పుడు నామినేషన్స్ ప్రక్రియలో గుడ్డు కావాలా నాయనా అంటూ కోడి గుడ్డు నెత్తి మీద పగలగొట్టించి హౌస్ మేట్స్ మధ్యన మంట రాజేసాడు. గత రాత్రి ఈ కోడిగుడ్డు నామినేషన్స్ లో ముందుగా కెప్టెన్ అరియనా సోహైల్ ని హారికాని నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పగా అరియానాకు, సోహైల్ కి చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇక అవినాష్ కూడా అభిజిత్ ని హారికాని నామినేట్ చేసాడు. అభిజిత్ కి అవినాష్ కి కోడిగుడ్డు నామినేషన్‌లో పెద్ద ఫైట్ జరిగింది.
ఇక సోహైల్ అయితే అభిజిత్‌ని, మోనాల్‌ని నామినేట్ చేసి.. కారణాలు చెప్పాడు. అయితే అభిజిత్ మాత్రం అవినాష్ ని నామినేట్ చేసి గుడ్డు పగలగొట్టగా అవినాష్ నా కామెడీ హెల్దీ కామెడీ.. కాబట్టే నేను బిగ్ బాస్ లోకి వచ్చాను,. వాళ్ళు నన్ను కామెడీ చెయ్యమని పిలిచారు.. నేను చేస్తానని.. ఐ యామ్ కమెడియన్ అంటూ బిగ్గరగా అరుస్తూ వెళ్లిపోగా అభిజిత్ తర్వాత అమ్మ రాజశేఖర్ ని నామినేట్ చేయబోగా.. ఆయన వాష్ రూమ్‌కి వెళ్లి రాలేదు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అభిజిత్ కి అమ్మకి గట్టిగా పడింది. అంతేకాదు.. హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి అఖిల్ - మోనాల్ జంట, ప్రేమ పక్షుల్లా మారిపోయి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.
అందుకే మోనాల్‌ని బిగ్ బాస్ ఎలిమినేట్ చెయ్యకుండా కాపాడుకుంటున్నారు. కానీ ఈ రోజు ఎపిసోడ్ లో అఖిల్, మోనాల్ ని గుడ్డుపగల గొట్టి నామినేట్ చెయ్యడం అందరికి షాకిచ్చింది. ఇక మోనాల్ కూడా నన్నెందుకు పాయింట్ అవుట్ చేసావ్ అఖిల్ అంటూ నిలదియ్యడం.. లాస్య, అమ్మ రాజశేఖర్ లు మోనాల్ ని అఖిల్ నామినేట్ చెయ్యడం ఏమిటా అని ఆశ్చర్య పోవడమే కాదు... నేను చివరి వరకు నేను నీకు అండగా ఉంటా అంటూ మోనాల్‌కి అమ్మ రాజశేఖర్ భరోసా ఇవ్వడం.. ఇప్పుడు అఖిల్ - అభిజిత్ - ఫ్రెండ్స్ కాగా. అమ్మ రాజశేఖర్, మోనాల్, అరియనా, అవినాష్ లు ఫ్రెండ్స్ అయ్యారు. అంటే గుడ్డు తెచ్చిన తంటాతో హౌస్‌లో రెండు గ్రూపులు మొదలయ్యాయన్నమాట.