Advertisementt

ఆచార్య.. వెయిటింగ్ లిస్ట్ నుంచి కన్ఫర్మ్ దిశగా!

Fri 06th Nov 2020 01:10 AM
acharya,chiranjeevi,november 9th,mega star chiranjeevi,koratala siva,covid,corona  ఆచార్య.. వెయిటింగ్ లిస్ట్ నుంచి కన్ఫర్మ్ దిశగా!
Acharya: Good News to Mega Fans ఆచార్య.. వెయిటింగ్ లిస్ట్ నుంచి కన్ఫర్మ్ దిశగా!
Advertisement
Ads by CJ

చిరంజీవి ఆచార్య సినిమా ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదని మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అటు నాగార్జున వైల్డ్ డాగ్, ఇటు బాలకృష్ణ BB3 సినిమాలు సెట్స్ మీద హడావిడి చేస్తుంటే చిరు మాత్రం మనవరాళ్లతో కుకింగ్ వీడియోస్ చేసుకుంటున్నాడు. మరి చిరు ఆచార్య ముందుకు కదలకపోవడానికి కారణం చిరు కరోనాకి భయపడుతున్నాడా? లేదంటే కొరటాల ఆలస్యం చేస్తున్నాడా? కాదు కాజల్ పెళ్లి సమస్యా? ఏమైనా కూడా ఆచార్య షూటింగ్ విషయంలో మెగా ఫ్యాన్స్ కంగారు రోజు రోజుకి ఎక్కువైపోతోంది. అయితే ఇప్పట్లో ఆచార్య సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదని అనుకుంటున్న తరుణంలో యూనిట్ గుడ్ న్యూస్ తెలిపింది.

కాజల్ ఇటీవలే పెళ్లి చేసుకుంది.. అప్పుడే షూటింగ్ అంటూ హడావుడి చేయడమెందుకు కొన్ని రోజులు గ్యాప్ తీసుకోనివ్వండి మనకేం తొందర లేదులే అని చిరు, కొరటాలకి చెప్పినట్టుగా వార్తలు వస్తున్న తరుణంలో.. అలాగే కొద్ది రోజులైతే కరోనా కంట్రోల్ అవుతుంది. లేదంటే ఈ లోపు వ్యాక్సిన్ వచ్చినా రావొచ్చు అని చిరు, కొరటాలకి చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న తరుణంలో చిత్రయూనిట్ ఈ సినిమా అప్డేట్‌ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఆచార్యని మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. నవంబర్ 9 నుంచి కోవిడ్ రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకుంటూ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపారు. మరి రామ్ చరణ్, అలాగే రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న కాజల్ షూట్‌లోకి ఎప్పుడు జాయిన్ అవుతారు.. అనేది ఇంకా సస్పేన్సే. ఆచార్య షూటింగ్ మొదలెట్టి ఏకధాటిగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ బరిలో నిలపాలని కొరటాల - చిరు ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Acharya: Good News to Mega Fans:

Acharya Movie Shooting Starts from Nov 9th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ