Advertisementt

ఆచార్య: చిరుకి కాజల్, చరణ్‌కి ఎవరంటే?

Tue 10th Nov 2020 01:51 AM
ram charan,acharya movie,chiranjeevi,ram charan heroine,samantha  ఆచార్య: చిరుకి కాజల్, చరణ్‌కి ఎవరంటే?
Heroine Fixed for Ram Charan role in Acharya Movie ఆచార్య: చిరుకి కాజల్, చరణ్‌కి ఎవరంటే?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ కి హీరోయిన్ ఫిక్స్ అవడమేమిటి అనుకుంటున్నారా.. మరి రాజమౌళి.. RRR లో రామ్ చరణ్ కోసం బాలీవుడ్ భామ అలియా భట్ ని పట్టుకొచ్చాడు. క్రేజీ హీరోయిన్ ని రాజమౌళి ఎందుకు తీసుకున్నాడో తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ మూవీ కాబట్టి బాలీవుడ్ సొగసులు అద్దాడు. మరి ఇప్పుడు చరణ్ కి హీరోయిన్ ఎందుకు అంటే.. రామ్ చరణ్ RRR కాకుండా తండ్రి చిరంజీవి ఆచార్యలో ఓ 30 నిమిషాల కీలక పాత్ర చెయ్యబోతున్నాడు. 30 నిమిషాల పాత్ర అంటే ఆ పాత్రకి హీరోయిన్ ఉండాలి, ఓ డ్యూయెట్ ఉండాలి. మరి ఇంతకుముందే కొరటాల శివ, ఆచార్యలో రామ్ చరణ్ పాత్రకి హీరోయిన్ ఉంటుంది, ఓ సాంగ్ కూడా ఉంటుంది అని చెప్పాడు కానీ.. హీరోయిన్ ఎవరూ అనే విషయం క్లారిటీ ఇవ్వలేదు.

రేపటి నుండి మొదలు కాబోతున్న ఆచార్య షూటింగ్ లో కొత్త పెళ్లి కూతురు కాజల్ కూడా హాజరు కాబోతుంది. మరి కొరటాల శివ, రామ్ చరణ్ కి హీరోయిన్ ని ఫైనల్ చేశాడో లేదో తెలియదు. కానీ మొన్నామధ్యన రామ్ చరణ్ పాత్రకి లక్కీ గర్ల్ రష్మిక హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. ఆ విషయమై క్లారిటీ లేదు కానీ.. తాజాగా రామ్ చరణ్ పాత్రకి కొరటాల ఓ హీరోయిన్ ని ఫిక్స్ చేశాడని.. అది కూడా ప్రస్తుతం ప్రాధాన్యమున్న పాత్ర కోసం వెయిట్ చేస్తున్న సమంతని ఆచార్య కోసం ఒప్పించారనే టాక్ మొదలయ్యింది. రామ్ చరణ్ తో రంగస్థలంలో నటించిన సమంత అయితే ఆ పాత్రకి క్రేజ్ పెరుగుతుంది అని.. చిరుకి - కాజల్, చరణ్‌కి - సమంత ఫిక్స్ అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Heroine Fixed for Ram Charan role in Acharya Movie:

Samantha for Ram Charan in Acharya Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ