బిగ్ బాస్ ఎనిమిది వారలు పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఫన్ పూర్తిగా మిస్ అయిన బిగ్ బాస్ కి ఇప్పుడు ఎనర్జీ బూస్ట్ కావాలి. కంటెస్టెంట్స్ లో ఉత్సాహాన్ని నింపాలి. పూర్తి డల్ గేమ్ ప్రదర్శిస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఎలా అయితే ఉత్సాహం వస్తుంది. ఏం చేస్తే వాళ్ళు యాక్టీవ్ అవుతారు. ఎలాంటి ట్విస్ట్ ఇస్తే మళ్ళీ బిగ్ బాస్ పుంజుకుంటుంది. ఎలిమినేషన్స్ తోనూ, కొంతమంది కంటెస్టెంట్స్ విషయంలోనూ బిగ్ బాస్ పై వస్తున్నా ట్రోలింగ్ కి బిగ్ బాస్ గట్టి పంచ్ ఇవ్వబోతుందా? అంటే ఇస్తుందనే అనిపిస్తుంది. బిగ్ బాస్ మొదలైన మొదటి వారంలోనే మూడు వైల్డ్ కార్డు ఎంట్రీ లు ఇప్పించిన బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించబోతుంది అనిపిస్తుంది. కానీ నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎనిమిది వారాల తర్వాత అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్ సాదా సీదా కాంటెస్ట్ కాదు.. ఆఖరికి హీరోయిన్స్ తీసుకొచ్చి హౌస్ లోకి పంపుతున్నామన్నా నమ్మేసేవారే.
కానీ ఇక్కడ ఆ కంటెస్టెంట్ ని చూస్తే నమ్మకమే కలగడం లేదు. ఆమె ఎవరో కాదు యాంకర్ సుమ. స్టార్ మహిళా, క్యాష్ ప్రోగ్రామ్స్ ఇంకా పలు షోస్ తో హడావిడిగా ఉండే యాంకర్ సుమ బిగ్ బాస్ గెస్ట్ గా వచ్చిన సందర్భాలున్నాయి . కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 లోకి వైల్డ్ కార్డు అంటున్నాడు నాగార్జున. ఆదివారం ఎపిసోడ్ లో సుమని బిగ్ బాస్ స్టేజ్ మీదకి సూట్ కేస్ తో సహా రప్పించడమే కాదు... హౌస్ లోని సభ్యులతో సుమ చెడుగుడు ఆడేసింది. మీ కోసం వైల్డ్ కార్డు ఎంట్రీ తో సుమని పంపిస్తున్నాం అనగానే హౌస్ లోని సభ్యులంతా కేకలు పెట్టారు. మరి సుమ అయితే అభిజిత్, అరియనా, అవినాష్, లాస్యలను హౌస్లోని సభ్యులని కామెడీ చేస్తూ తెగ నవ్వించింది.
కానీ సుమ బల్ల గుద్ది చెప్పినా బిగ్ బాస్ లోకి సుమ వైల్డ్ కార్డు అంటే నమ్మలేము కదా.. మరి నాగ్ కూడా ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పుడు ఈ మిగతా ఐదు వారలు బిగ్ బాస్ హౌస్ సుమ సందడితో దద్దరిల్లిపోతుందిఅన్నాడు. ఇక సుమ బయట ఈ ఎంటర్టైన్మెంట్.. లోపల ఇంకా అదిరిపోతోంది అంటూ చేసిన హంగామా చేసూస్తే సుమ నిజంగానే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందా? ఏమో ఈ రాత్రి ఎపిసోడ్ లో ఓ క్లారిటీ వస్తుందిలే.