Advertisementt

కాళ్ళ బేరానికి వచ్చిన పూజ హెగ్డే!!

Sun 08th Nov 2020 08:11 PM
pooja hegde,tollywood,south industry,fans  కాళ్ళ బేరానికి వచ్చిన పూజ హెగ్డే!!
Pooja Hegde Clarity about her Comments on tollywood కాళ్ళ బేరానికి వచ్చిన పూజ హెగ్డే!!
Advertisement
Ads by CJ

మొన్నేదో ఇంటర్వ్యూ లో సౌత్ సినిమాలు తనకి మంచి అవకాశాలు ఇచ్చాయని.. కాకపోతే.. సౌత్  ప్రేక్షకులు నడుము మత్తులోనే ఉంటారంటూ.. పూజా హెగ్డే సౌత్ ప్రేక్షకులు, ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అల వైకుంఠపురములో కాళ్ళు చూపిస్తూ పూజా ఎక్స్‌పోజింగ్ చెయ్యడంపై అప్పట్లో సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ కి పూజా హెగ్డే ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ తన కాళ్లను పొగుడుతూ తన అందాలను చూస్తూ అల్లరిపట్టిస్తుంటే.. నేను అల్లు అర్జున్ కి మంచి చెప్పడం, అలానే నీతులు కూడా చెప్పాను. అది పట్టించుకోకుండా అందరూ నా కాళ్ళని హైలెట్ చేస్తూ మాట్లాడారు అంటూ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది. 

మరి సౌత్ ఇండస్ట్రీ లైఫ్ ఇస్తే పూజా హెగ్డే సౌత్ అభిమానం గురించి ఇలా మాట్లాడడం నచ్చలేదంటూ సౌత్ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డేని ఏకిపారేశారు. నిజం చెప్పాలంటే పూజా హెగ్డేకి టాలీవుడ్ ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చింది. అంతేకాదు.. ఆమె నడుము, గ్లామర్ చూపించే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసింది. అలాంటి సౌత్ ఇండస్ట్రీ, అభిమానులపై పూజా చేసిన వ్యాఖ్యలు నిజంగానే హాట్ హాట్ చర్చలకు దారి తీశాయి. 

అందుకే పూజా హెగ్డే ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చింది. ‘నేను ఇంటర్వ్యూ లో ఒక రకంగా మాట్లాడితే అది వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. నాకు టాలీవుడ్ సినిమాలంటే ప్రాణం. నా సినిమాలను ఆదరించిన అభిమానులకు, వారి అభిమానానికి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఎటువంటి అపార్ధాలకు తావివ్వకూడదనే నేను ఇప్పుడు ఈ విషయంపై స్పందిస్తున్నాను’ అంటూ ఓ లెటర్‌ని పూజా విడుదల చేసింది.

Pooja Hegde Clarity about her Comments on tollywood:

Pooja Hegde clarifies on the misinterpretation being circulated about her latest interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ