Advertisementt

టాప్ 5 అంటుంటే.... ఎలిమినేట్ అంటాడేమిటి?

Wed 11th Nov 2020 04:59 PM
abhijeet,bigg boss,top 5,self nominate  టాప్ 5 అంటుంటే.... ఎలిమినేట్ అంటాడేమిటి?
Bigg Boss: Why Self Nomination Abhijeet? టాప్ 5 అంటుంటే.... ఎలిమినేట్ అంటాడేమిటి?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 ఆఖరి అంకంలోకి చేరింది. మరో నాలుగు వారాల్లో బిగ్ బాస్ సీజన్ ముగియబోతుంది. ఈలోపు నామిషన్స్ లో అభిజిత్, అరియనా, మోనాల్, సోహైల్, మెహబూబ్ ఉంటే.. అందులో మెహబూబ్ ఈ వారం వెళ్లిపోయే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క గత రాత్రి జరిగిన కెప్టెన్సీ టాస్క్ ని బిగ్ బాస్ రద్దు చేసింది. కారణం బిగ్ బాస్ ఒకలా చెప్పి టాస్క్ పెడితే కంటెస్టెంట్స్ మరోలా ఆడడంతో.. ఫైనల్ లో ఉన్న అఖిల్ - మెహబూబ్ లకి కెప్టెన్సీ ఇవ్వకుండా టాస్క్ రద్దు చెయ్యడమే కాదు.... ఇన్ని వారాలున్నా అట ఎలా ఆడాలో మీకు ఇంకా తెలియడం లేదంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి క్లాస్ పీకాడు. తర్వాత సోహైల్ - మెహబూబ్ - అఖిల్ మధ్యన ఫ్రెండ్ షిప్ వార్ జరగడం తర్వాత ముగ్గురు కలిసిపోవడం వరకు బాగానే ఉంది.

కానీ హౌస్ మేట్స్ అందరూ నిద్ర పోయాక బిగ్ బాస్ అలారం మోగించి మరీ అందరిని నిద్ర లేపి స్టోర్ రూమ్ కి వెళ్లి సూట్కేసెస్ సర్దుకుని బయటికి రమ్మని చెప్పడమే కాదు... ఇప్పటివరకు మిమ్మల్ని బయటకి పంపడం అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కానీ.. ఇప్పుడు మీలో ఎవరు అన్ ఫిట్టొ మాట్లాడుకుని మీలో ఒకరిని హౌస్ బయటికి పంపేలా మీరు చెయ్యాల్సి ఉంటుంది అంటూ చెప్పగానే సూట్కేస్ లు తీసుకుని బయటికికొచ్చిన హౌస్ మేట్స్ నేను ఎందుకు హౌస్ లో ఉండాలి అనుకుంటున్నానో అంటూ మొదలు పెట్టగా అవినాష్ కి అరియనా స్ట్రాంగ్ అనిపిస్తే.. అరియనాకి అఖిల్ స్ట్రాంగ్ అనిపించాడు. ఇంకా సోహైల్ కి మెహబూబ్ స్ట్రాంగ్ అన్నాడు. ఇక హారిక ఆర్గ్యూ చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అభిజిత్, హౌస్ నుండి బయటికి పంపాలనుకునే పేరు చెప్పాలంటే అందులో నేనే ఉంటా అంటూ అభిజిత్ తనకి తానుగా బిగ్ బాస్ కి తన పేరు చెప్పడం అందరికి షాకిచ్చింది.

మరి బిగ్ బాస్ టాప్ 5 లో అభిజిత్ పక్కా అంటుంటే.. ఈ వారం నామినేషన్స్ లో అఖిల్ నామినేట్ చేసాడని.. అతన్ని కాస్త రెచ్చగొట్టినట్టుగా మాట్లాడి.. నువ్ ఎలా నామినేట్ చేస్తావ్ బ్రదర్.. ఒకవేళ నేను ఎలిమినేట అయితే అంటూ అఖిల్ తో వాదానికి దిగిన అభిజిత్ ఇప్పుడు ఇలా తనకి తానుగా ఎలిమినేట్ అవుతా అంటున్నాడు. మరి అభిజిత్ లాజిక్ ఏమిటో ఎవరికీ ఓ పట్టాన అర్ధం కావడం లేదు.

Bigg Boss: Why Self Nomination Abhijeet?:

Abhijeet in Everybody's Top 5 vision.. But He Wants to Self Nominate

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ