Advertisementt

ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు..

Wed 11th Nov 2020 08:33 PM
ranguladdukunna,uppena,super star mahesh babu,krithi shetty,devi sri prasad,mythri movie makers,sukumar,buchi babu sana,panja vaishnav tej  ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు..
Devi Sri Prasad is back with Uppena.. ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు..
Advertisement
Ads by CJ

కొట్టిన ట్యూన్లనే కొడుతున్నాడని కొత్తదనం కొరవడిందని కోడై కూసిన సొషల్ మీడియా, ఈ దెబ్బతో తన మాట మార్చుకుంటుందేమో. దేవి కూడా ఓల్డ్ అయిపోయాడా అని అనుమానం వచ్చిన వాళ్లందరికీ తామనుకున్నది తప్పని తెలుసుకునే టైమ్ వచ్చేసిందేమో. ఉప్పెన చిత్రంతో ఈ అనుమానాలన్నింటినీ దేవిశ్రీ ప్రసాద్ బద్దలు కొట్టేలా ఉన్నాడు. పంజా వైష్ణవ్ తేజ్, హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా నుండి తాజాగా రంగులద్దుకున్న అనే పాట రిలీజైంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. సాహిత్య పరంగానూ, సంగీతం పరంగానూ మరో లెవెల్ లో ఉన్న పాట ఉప్పెన సినిమాపై అంచనాలని విపరీతంగా పెంచేసింది. ఎవ్వరికీ కనబడకుండా ప్రపంచంతో దాగుడుమూతలు ఆడుతూ, ప్రేమించుకుంటున్న ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే ఈ పాట ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

అందరూ ఉన్నచోట ఇద్దరవుదాం..ఎవ్వరూ లేని చోట ఒక్కరవుదాం.. ఏ క్షణం విడివిడిగా లేమందాం. మన ఊసు మోసే గాలిని మూటకడదాం.. మన జాడ తెలిపే నేలని పాతిపెడదాం.. సాక్ష్యంగా సంద్రాలు ఉంటే దిగుడు బావిలో దాచి మూతపెడదాం లాంటి లైన్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మొత్తంగా ఉప్పెన పాట పూర్తిగా ఆకర్షిస్తోంది. ఈ దెబ్బతో దేవిశ్రీ ప్రసాద్ లైన్లోకి వచ్చేసినట్టే అని అర్థం అవుతుంది.

Click here for Song

Devi Sri Prasad is back with Uppena..:

Devi Sri Prasad is back with Uppena..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ