Advertisementt

బిగ్‌బాస్‌లో జబర్ధస్త్ పరువు తీసేస్తోన్న కంటెస్టెంట్!

Thu 12th Nov 2020 11:14 PM
jabardasth show,degrade,bigg boss house,avinash,avinash brothers  బిగ్‌బాస్‌లో జబర్ధస్త్ పరువు తీసేస్తోన్న కంటెస్టెంట్!
Avinash Sensational Comments on Jabardasth in Bigg Boss బిగ్‌బాస్‌లో జబర్ధస్త్ పరువు తీసేస్తోన్న కంటెస్టెంట్!
Advertisement
Ads by CJ

జబర్దస్త్ అవినాష్‌కి కరోనా భారీ షాకివ్వడంతో మంచి ఆఫర్‌తో బిగ్ బాస్ లోకి అవకాశం రావడంతో.. జబర్దస్త్‌కి కట్టాల్సిన పది లక్షల ఫైన్ కట్టేసి బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేశాడు. బిగ్ బాస్‌లోకి అవినాష్ ఎంటర్ అయిన దగ్గరనుండి తనకి వచ్చిన కామెడీతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇది 100కి 100 శాతం నిజం. అయితే అవినాష్ మధ్యలో ఎలిమినేషన్ ప్రక్రియలో నామినేట్ అయినా, లేదంటే మరేదన్నా కానివ్వండి సింపతీ కార్డు వాడుతూ తనకి బిగ్ బాస్ సర్వస్వము బయటికి వెళితే జబర్దస్త్‌లోకి రానివ్వరు.. వాళ్ళు చెప్పేశారంటూ బిగ్ బాస్ ప్రేక్షకుల దగ్గర సింపతీ కొట్టేస్తున్నాడు. మొన్న ఎలిమినేషన్స్‌లోను ఎలిమినేట్ అయ్యాననుకున్న అవినాష్ జీరోకి పడిపోయా అంటూ ఏడవడం చూస్తే అవినాష్ ఎంతగా సింపతీ కోసం పాకులాడుతున్నాడో పూర్తిగా అర్ధమవుతుంది.

అయితే అవినాష్ ని జబర్దస్త్ నుండి బయటికి పంపలేదు.. అవినాష్ కావాలనే బిగ్ బాస్ కోసం వచ్చాడు. డబ్బు ఇంపార్టెంట్ అయిన సమయంలో అక్కడికన్నా ఇక్కడ రెమ్యునరేషన్ అధికంగా ఉంటుంది అని.. అవినాష్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. అయితే ఇప్పుడు అవినాష్ ని మళ్ళీ జబర్దస్త్ లోకి తీసుకోరనేది అబద్దం అంటున్నారు అవినాష్ తమ్ముళ్లు. అవినాష్ తో పాటుగా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తమ్ముళ్లు.. అవినాష్ జబర్దస్త్ నుండి బయటికి వచ్చినా వాళ్ళు అందులోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళే అవినాష్ మళ్లీ వస్తే జబర్దస్త్ లో తీసుకోవడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు.

అవినాష్ జబర్దస్త్ కి దూరమవడం అంతా అబద్దమని.. అవినాష్ ని మళ్ళీ జబర్దస్త్ లోకి తీసుకుంటారని.. ఎప్పటిలాగే మాస్ అవినాష్ - కెవ్వు కార్తీక్ టీం లీడర్స్ గానే అవినాష్ ఉంటాడని అవినాష్ తమ్ముళ్లే చెబుతున్నారు. మరి అవినాష్ బిగ్ బాస్ లో కావాలనే జబర్దస్త్ కి రానివ్వరూ అంటూ సింపతీ క్రియేట్ చేసుకుంటున్నాడా? లేదంటే షో వాళ్ళు చెప్పారు కాబట్టి అవకాశం దక్కదని ఫీలవుతున్నాడో? కానీ... అవినాష్ బిగ్ బాస్ లో జబర్దస్త్ పేరు తియ్యకుండా ఉంటే బావుండేదని అంటున్నారు కామెడీ ప్రియులు.

Avinash Sensational Comments on Jabardasth in Bigg Boss:

Jabardasth show Degrade at Bigg Boss House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ