Advertisementt

ఇది చాలు.. ‘రాధేశ్యామ్‌’ రేంజ్‌ మారడానికి..!

Fri 13th Nov 2020 03:30 PM
prabhas,pooja hegde,radhe shyam movie  ఇది చాలు.. ‘రాధేశ్యామ్‌’ రేంజ్‌ మారడానికి..!
Radhe Shyam team spent Rs 30 Crores for Climax episode ఇది చాలు.. ‘రాధేశ్యామ్‌’ రేంజ్‌ మారడానికి..!
Advertisement
Ads by CJ

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు రెడీ. ఆ విషయం బాహుబలితోనే తేలిపోయింది. సాహో విషయంలోనే యువీ నిర్మాతలు ప్రభాస్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ కోసం కోట్లు కుమ్మరించారు. సాహో సినిమా కంటెంట్ పరంగా వీక్ అయినా.. యాక్షన్ పరంగా హాలీవుడ్ రేంజ్ ఉన్న సినిమా. అయితే కోట్లు కుమ్మరిస్తున్నాం అంటే.. అది వర్కౌట్ అయితే ఓకే.. లేదంటే అదంతా వృధానే. తాజాగా ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అని.. అది కూడా స్టైలిష్ గా భారీ లెవల్లో ఉండబోతుంది అని ప్రభాస్ చెప్పాడు.

అయితే ఇప్పుడు రాధేశ్యామ్‌ సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెల్‌ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశారని.. దాని కోసం నిర్మాతలు అక్షరాలా 30 కోట్లు ఖర్చుపెట్టబోతున్నట్లుగా ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ కూడా రాధేశ్యామ్‌ క్లైమాక్స్‌లో ఉండబోతుంది అని.. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్, ఆస్కార్ విజేత నిక్ పావెల్ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని డైరెక్ట్ చేయబోతున్నాడట. హైదరాబాద్‌లో భారీ సెట్స్ వేసి ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించడానికి నిర్మాతలు 30 కోట్లు ఖర్చుపెడుతున్నారట. మరి లవ్ స్టోరీ అంటూనే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం అన్ని కోట్లు ఖర్చు అంటే.. అది ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనేది ఊహకి కూడా అందడం లేదు.

Radhe Shyam team spent Rs 30 Crores for Climax episode:

Prabhas Radhe Shyam Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ