బిగ్ బాస్ పది వారలు పూర్తి చేసుకుని.. 11 వ వారంలోకి అడుగుపెట్టబోతుంది. మరొక్క నెలలో బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కాబోతుంది . ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదిమంది... సీక్రెట్ రూమ్ లో అఖిల్ ఉన్నారు. బిగ్ బాస్ వీక్ డేస్ లో వీక్ గా ఉండడంతో వీకెండ్స్ లో మాత్రం జోరు చూపిస్తుంది. నాగార్జున ఫన్, కామెడీ దానికి తోడు గెస్ట్ ల రాక. సమంత ఎపిసోడ్ లో కార్తికేయ, పాయల్ రాజ్ ఫుట్ స్పెషల్ డాన్స్ లు ఉండగా.. అఖిల్ గెస్ట్ గా బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చాడు. అయితే గత వారం యాంకర్ సుమ ని తీసుకొచ్చి బిగ్ బాస్ ప్రేక్షకులను మాయ చేసాడు నాగార్జున. సుమ - నాగ్ కలిసి గత ఆదివారం ఎపిసోడ్ ని ఓ రేంజ్ లో రక్తి కట్టించారు.
తాజాగా దివాళి రోజున నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీద మెరిసిపోవడమే కాదు... తన భార్య అమల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం స్పెషల్ గా పంపిన గిఫ్ట్స్ ని కంటెస్టెంట్స్ కి ఇవ్వడమే కాదు... నిన్న మీ కోసం అమల కష్టపడి గిఫ్ట్స్ సెలెక్ట్ చేసి మీకు పంపింది అని చెప్పాడు. ఇక హౌస్ మేట్స్ తో ఎప్పటిలాగే నాగార్జున ఫన్నీ కామెంట్స్ .. అవినాష్ - అరియనా పులిహోర, లాస్య చీమ ఏనుగు జోక్, అభిజిత్ అమెరికా పబ్ అంటూ శనివారం ఎపిసోడ్ ని ఫన్నీగా మార్చబోతున్నాడు నాగ్.