Advertisementt

అభిజిత్ సేఫ్... అఖిల్ మొఖం చూడాలీ...!!

Sun 15th Nov 2020 10:34 PM
bigg boss 4,nagarjuna,abhijith,akhil  అభిజిత్ సేఫ్... అఖిల్ మొఖం చూడాలీ...!!
Bigg Boss 4: Akhil vs Abhijith అభిజిత్ సేఫ్... అఖిల్ మొఖం చూడాలీ...!!
Advertisement
Ads by CJ

గత వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న డల్ నెస్ చూసి బిగ్ బాస్ ప్రేక్షకులు బాగా బోర్ ఫీలవుతున్నారు. సీజన్ 4 మరీ వీక్ గా ఉందనే కామెంట్స్ పడడంతో...  నాగార్జున శని అది వారాల ఎపిసోడ్స్ ని భుజల మీద వేసుకుని లాగుతున్నాడు. దాని కోసం నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీద కంటెస్టెంట్స్ ని ఏక్కిరించాడని ఎగరడం లాంటివి కూడా చేస్తున్నాడు. ఇక ఈ వారం లో మీకు ఎవరు అడ్డుపడుతున్నారో ఆ కంటెస్టెంట్ ని బయటికి పంపమంటే అభిజిత్, లాస్య, హరికలు మా ఫ్రెండ్స్ బయటికి వెళితే ఎలా అంటే... మోనాల్, అరియనా, మెహబూబ్ లు అఖిల్ పేరు చెప్పగా.. అఖిల్ ఏడ్చుకుంటూ బయటికి వెళ్లగా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో కి పంపారు.ఇక అఖిల్ అక్కడ నుండి హౌస్ ఎలా ఏం జరుగుతుందో చూస్తూ అభిజిత్ పై కాసిని పెంచుకోవడం చూసారు ప్రేక్షకులు. 

అయితే శనివారం ఎపిసోడ్ లో అఖిల్ కి గట్టిగా క్లాస్ పీకి ప్యాక్ యువర్ బాగ్స్ అంటూ గట్టిగా హెచ్చరించడంతో.. అఖిల్ ఏడుపు స్టార్ట్ చేసాడు. మమ్మీ అంటూ చిన్నపిల్లాడిలా ఎమోషన్ అయ్యాడు. ఇక నాగార్జున కూడా అఖిల్ ని హౌస్ మేట్స్ తో సెల్ఫీ తీసుకోమని... ఇద్దరు మిత్రులని, నలుగురు శత్రువులను చూస్ చేసుకోమనగానే.. సోహైల్ కి మోనాల్ కి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. అభిజిత్, హారిక, లాస్య, మెహబూబ్ లను శత్రువులుగా మార్చుకున్నాడు అఖిల్. అభిజిత్ నీ సోచ్ పడిపోయింది చూసుకోమనడం, హారిక నేను సింపతీ కోసం ఆడడం లేదంటూ.. లాస్య తాను వెళ్ళాక వేసిన జోక్స్ కి హార్ట్ అయ్యానని చెప్పడం, మెహబూబ్ కి గేమ్ కోసం క్లాస్ తీసుకోవడం చేసాడు అఖిల్. ఇక అఖిల్ ఎలిమినేట్ అవుతున్నాడు అనుకుని ఫిక్స్ అయ్యేలోపు .. నాగ్ ఉన్నట్టుండి అఖిల్ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావ్ అనగానే మోనాల్, సోహైల్, మెహబూబ్ ల ఆనందానికి అవధులు లేవు. 

అయితే ఈ శనివారం ఎవరు సేఫ్ అయ్యారో చెప్పేముందు నామినేషన్స్ లో ఉన్నవారి తలపై బాటిల్ పగల గొట్టుకోమనగా.. మెహబూబ్, మోనాల్, హారిక,  సోహైల్, అరియనాలకు అన్ సేఫ్ రాగా.. అభిజిత్ ఫస్ట్ సేవ్ అయ్యాడు.. అభిజిత్ సేవ్ అనగానే అక్కడే ఉన్న అఖిల్ మొహం మాడిపోయింది. అభిజిత్ మీద బాగా పెట్టుకున్న అఖిల్ కి అభిజిత్ సేవ్ అవడం ఇష్టం లేనట్టుగా ఫేస్ పెట్టుకున్నాడు. అది చూసిన బుల్లి తెర ప్రేక్షకులు, అభిజిత్ ఫాన్స్ అభి సేవ్ అవగానే.. అఖిల్ మొహం చూడాలీ అంటూ కామెడీ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు అభిజిత్ - అఖిల్ లు నువ్వవా నేనా అని పోటీపడేలా కనబడుతుంది ప్రస్తుతం వ్యవహారం.

Bigg Boss 4: Akhil vs Abhijith :

Nag makes akhil cry in Bigg boss 4 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ