Advertisementt

బోరు.. బోరుమంటున్న బిగ్ బాస్ హౌస్!!

Mon 16th Nov 2020 10:30 PM
bigg boss,mehaboob,eliminated  బోరు.. బోరుమంటున్న బిగ్ బాస్ హౌస్!!
Emotions Flooding Bigg boss house బోరు.. బోరుమంటున్న బిగ్ బాస్ హౌస్!!
Advertisement
Ads by CJ

ప్రతి వారం లాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో.. బిగ్ బాస్ లీకుల వీరులు ముందే లీక్ చేసినట్టుగా.. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 4 నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే. అసలు మెహబూబ్, నాగ్ తో స్టేజ్ మీదకి రాకముందు నుండే బిగ్ బాస్ హౌస్ ఏడుపులతో నిండిపోయింది. సోహైల్ కి - మెహబూబ్ కి మధ్యన ఎవరు సేవ్ అవుతారో అనే టాస్క్ లో మెహబూబ్ ఎలిమినేట్ అవ్వగా.. అక్కడనుండి సోహైల్ ఏడుపు స్టార్ట్ చేసాడు. మెగబూబ్ ఎలిమినేట్ అవడం జీర్ణించుకోలేని సోహైల్ బిగ్గరగా ఏడుస్తూ హే అలా అంటుంటే.. అభిజిత్, అవినాష్, మోనాల్, అఖిల్, హారిక, లాస్య అందరూ ఏడుస్తూ మెహబూబ్ ని బయటికి పంపేశారు. 

టాప్ 5 టాప్ 5 అంటూ వాడు ఇప్పుడు ఎలిమినేట్ అవడం ఏంటి అంటూ సోహైల్ అయితే బిగ్గరగా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక మెహబూబ్ అయితే చెప్పే పనే లేదు.. నువ్ ఎలిమినేట్ అనగానే మొదలెట్టిన ఏడుపు నాగార్జున తో స్టేజ్ మీదున్నంత సేపు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఒక్కో హౌస్ మేట్స్ తో మట్లాడుతూ మెహబూబ్ ఎమోషనల్ గా ఏడుస్తూ హౌస్ మేట్స్ ని ఏడిపించేసాడు. సండే ఫన్ డే అనేకన్నా... సండే క్రయింగ్ డే అనొచ్చేమో అనిపించేలా హౌస్ మేట్స్ ఏడుపు, మెహబూబ్ ఏడుపు ఉంది. బిగ్ బాస్ ప్రేక్షకులకు చిరాకు పుట్టేలా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ కనిపించింది. 

ఇక మెహబూబ్ అయితే స్టేజ్ మీద సోహైల్ తో మట్లాడుతూ ఏడ్చాడు చూడండి.. బాబోయ్ ఇలా ఏడుస్తున్నాడేమి అనుకునేలా అన్నమాట. వెళ్తూ వెళ్తూ ఓ సాంగ్ కి డాన్స్ పెరఫార్మెన్స్ చేసాడు మెహబూబ్. సోహైల్ అయితే ఏడుస్తూనే ఉన్నాడు. ఇక మెహబూబ్ వెళ్తూ అవినాష్ కి బిగ్ బాంబ్ వేసాడు. అంటే ఓ వారం అవినాష్ నాన్ వెజిటేరియన్.. అందులోను ఎగ్ కూడా టచ్ కూడా చెయ్యకూడదన్నమాట.

Emotions Flooding Bigg boss house:

Mehaboob eliminated from bigg boss, everyone emotional

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ